Rain: ముంచెత్తిన వాన
ABN, First Publish Date - 2023-05-30T20:48:16+05:30
ఎండతీవ్రతతో మంగళవారం మధ్యాహ్నం వరకు ప్రజలు అల్లాడిపోగా, ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయి గంటసేపు కురిసిన గాలివాన ఒంగోలు నగరాన్ని ముంచెత్తింది.
ఒంగోలు: ఎండతీవ్రతతో మంగళవారం మధ్యాహ్నం వరకు ప్రజలు అల్లాడిపోగా, ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయి గంటసేపు కురిసిన గాలివాన ఒంగోలు నగరాన్ని ముంచెత్తింది. భారీగా ఈదరుగాలులు వీయడంతోపాటు ఉరుములు, మెరుపులతో మిట్ట మధ్యాహ్నం చిమ్మచీకట్లు కమ్ముకున్నాయి. కుండపోత వానకు నగర వీధులన్నీ జలమయం అయ్యాయి. డ్రైనేజి వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటంతోమురుగునీరురోడ్లపైకి చేరి చెరువులను తలపించాయి. ముఖ్యంగా కర్నూలు రోడ్, బాపూజీ కాంప్లెక్స్, ఆర్టీసీ బస్తాండ్ సెంటర్, భాగ్యనగర్, రైల్వేస్టేషన్‌తోపాటు పలు లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
పిడుగుపాటుకు ఇద్దరు కాపరులు మృతి
పిడుగులు పడి ప్రకాశం జిల్లాలో ఇద్దరు మృతిచెందారు. మంగళవారం మధ్యాహ్నం ఒంగోలు విరాట్‌నగర్‌కు చెందిన పులి రాము(60) పేర్నమిట్ట పొలాల్లో గొర్రెలు మేపుతుండగా పిడుగు పడటంతో అక్కడిక్కడే మృతిచెందారు. అలాగే నాగులుప్పలపాడు మండలం చదలవాడ పొలంలో గొర్రెలు మెపుతున్న ఎద్దు వెంకట రమణ(46) అనే మహిళ గాలులు, వర్షం నుంచి రక్షణ కోసం వేపచెట్టు కిందకు వెళ్లగా అక్కడ పిడుగుపడి మృతి చెందింది.
Updated Date - 2023-05-30T20:48:16+05:30 IST