ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP High Court: టెండర్లు ఫైనలైజ్ చేసినా నిధులు విడుదల చెయ్యొద్దు..

ABN, First Publish Date - 2023-12-13T12:43:15+05:30

టీటీడీ నిధులు తిరుపతి మున్సిపల్ కార్పోరేషన్ కు కేటాయించడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. నిధుల విడుదల నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. తిరుపతి పరిశుభ్రత, తిరుపతి రహదారుల నిర్వహణ కోసం కార్పోరేషన్ నాలుగు టెండర్లు పిలిచింది. దీన్ని సవాలు చేస్తూ బీజేపీ నేత భాను ప్రకాష్‌ రెడ్డి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

అమరావతి: టీటీడీ నిధులు తిరుపతి మున్సిపల్ కార్పోరేషన్ కు కేటాయించడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. నిధుల విడుదల నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. తిరుపతి పరిశుభ్రత, తిరుపతి రహదారుల నిర్వహణ కోసం కార్పోరేషన్ నాలుగు టెండర్లు పిలిచింది. దీన్ని సవాలు చేస్తూ బీజేపీ నేత భాను ప్రకాష్‌ రెడ్డి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ రోజు హైకోర్టులో పిల్ విచారణకు వచ్చింది. న్యాయవాది ఎలమంజుల బాలాజీ పిల్‌పై వాదనలు వినిపించారు.

టీటీడీ నుంచి నిధుల విడుదల అనేది దేవాదాయ చట్టంలోని నిబంధనలకు విరుద్ధమని బాలాజీ వాదించారు. టీటీడీ నిధులు భక్తుల సౌకర్యాలు, తిరుమల అభివృద్ధి కోసమే వినియోగించాలని కోరారు. పిటిషనర్ బాలాజీ వాదనలు పరిగణలోనికి హైకోర్టు తీసుకుంది. టెండర్లు ఫైనలైజ్ చేసినా నిధులు విడుదల చెయ్యొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. టీటీడీ, ప్రభుత్వానికి కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కేసు విచారణ రెండు వారాలకు వాయిదా పడింది.

Updated Date - 2023-12-13T12:43:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising