ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Nara Lokesh : నారా లోకేష్ పాదయాత్రలో హై టెన్షన్..

ABN, First Publish Date - 2023-08-24T13:58:05+05:30

బాపులపాడు మండలం రంగన్నగూడెంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రలో కొద్ది సేపు హై టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. నారా లోకేష్ పాదయాత్రలో కవ్వింపు చర్యలకు పాల్పడుతూ వైసీపీ బ్యానర్ ఏర్పాటు చేసింది. బ్యానర్ పై వైసీపీ హయంలో రెండు కోట్ల 71 లక్షల రూపాయలతో పనులు చేసిన వివరాలను వైసీపీ కార్యకర్తలు పొందుపరిచారు.

అమరావతి : బాపులపాడు మండలం రంగన్నగూడెంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రలో కొద్ది సేపు హై టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. నారా లోకేష్ పాదయాత్రలో కవ్వింపు చర్యలకు పాల్పడుతూ వైసీపీ బ్యానర్ ఏర్పాటు చేసింది. బ్యానర్ పై వైసీపీ హయంలో రెండు కోట్ల 71 లక్షల రూపాయలతో పనులు చేసిన వివరాలను వైసీపీ కార్యకర్తలు పొందుపరిచారు. వైసీపీ నాయకులతో ఫోటో వేయడాన్ని టీడీపీ శ్రేణులు తప్పు పట్టాయి. బాపులపాడు మండలం రంగన్నగూడెంలో కొడాలి నాని, వల్లభనేని వంశీ ఫొటోలతో బ్యానర్లు ఏర్పాటు చేశారు. లోకేష్ పాదయాత్ర రంగన్న గూడెంకు రాగానే బ్యానర్ వద్ద నిలబడి టీడీపీ నేతలను వైసీపీ శ్రేణులు కవ్వించాయి. వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య కొద్దిసేపు తోపులాట, వాగ్వాదం జరిగింది. టీడీపీ శ్రేణులు తిరగబడటంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే పోలీసులు సైతం వైసీపీ కవ్వింపు చర్యలన్ని నియంత్రించలేదు. ఈ క్రమంలోనే ఫ్లెక్సీని తొలగించాలంటూ పోలీసులతో దేవినేని ఉమ వాగ్వాదానికి దిగారు. వైసీపీ శ్రేణులకు మద్దతుగా పోలీసులు వ్యవహరిస్తున్నారని టీడీపీ మండిపడింది. వైసీపీ నేతల భద్రత కోసం భారీగా పోలీసుల్ని మోహరించారంటూ టీడీపీ ఆరోపణలు చేసింది. చివరకు ఫ్లెక్సీని తొలగించడంతో వివాదం సద్దుమణిగింది.

Updated Date - 2023-08-24T13:58:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising