మహా శివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తికి పోటెత్తిన భక్తజనం
ABN, First Publish Date - 2023-02-18T08:04:30+05:30
శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తజనం పోటెత్తింది. ఉదయం రెండు గంటల నుంచి భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు. ఇక సర్వదర్శనంతోపాటు రూ.50, రూ.200, రూ.500ల టికెట్లతో ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు.
తిరుపతి : శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తజనం పోటెత్తింది. ఉదయం రెండు గంటల నుంచి భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు. ఇక సర్వదర్శనంతోపాటు రూ.50, రూ.200, రూ.500ల టికెట్లతో ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. భక్తులకు మహాలఘు దర్శనాన్ని ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. సర్వదర్శనం, రూ.50 టికెట్ ద్వారా వెళుతున్న భక్తులకు ప్రస్తుతం దర్శనానికి రెండు గంటల పైగా సమయం పడుతోంది. ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతోంది. స్వామి అమ్మవార్లు దర్శనంలో వీఐపీలకు పెద్దపేట వేస్తున్నారని సామాన్య భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - 2023-02-18T10:15:49+05:30 IST