ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nara Lokesh Padayatra: నేనూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బాధితుడినే: లోకేశ్

ABN, First Publish Date - 2023-02-06T21:37:40+05:30

టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ మూకలు దాడి చేసినప్పుడు అక్కడికి వచ్చి ఫొటోలు తీస్తున్న నాయక్‌ అనే సీఐని మా కార్యకర్తలు ప్రశ్నించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: ‘టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ మూకలు దాడి చేసినప్పుడు అక్కడికి వచ్చి ఫొటోలు తీస్తున్న నాయక్‌ అనే సీఐని మా కార్యకర్తలు ప్రశ్నించారు. దీనికి నాపైన, అశోక్‌ బాబుపైన కేసులు పెట్టారు. ఇలా జగన్‌రెడ్డి రాజ్యంలో నేను కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బాధితుడినే’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) తెలిపారు. చిత్తూరు (Chittoor)లో సోమవారం జరిగిన 11వ రోజు యువగళం పాదయాత్ర (YuvaGalamPadayatra)లో ఆయన 9.2 కిలోమీటర్లు నడిచారు. వైసీపీ ప్రభుత్వ అణచివేతకు గురవుతున్న భిన్న వర్గాలు.. అధికారులను, ప్రజాప్రతినిధుల్ని కలిసి తమ బాధలు చెప్పుకోవడం మానేసి, పాదయాత్ర సమయంలో లోకేశ్‌ను కలిసి తమ బాధలు చెప్పుకుంటున్నారు. ఇలా సోమవారం బీమా మిత్రలు, బీడీ కార్మికులు, న్యాయవాదులు, విద్యుత్తు ఉద్యోగులు, మహిళలు, దళితులు... తదితరులు లోకేశ్‌ను కలిసి తమ సమస్యల్ని వివరించారు.

11వ రోజు 9.2 కిలోమీటర్లు

నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర 11వ రోజైన సోమవారం 9.2 కిలోమీటర్లు సాగింది. ఈ 11 రోజుల్లో మొత్తం 139.8 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేసుకుంది. నగరమంతా లోకేశ్‌ కటౌట్లు, బ్యానర్లతో నిండిపోయింది. జిల్లా కేంద్రంలో సాగిన పాదయాత్రలో స్థానిక టీడీపీ నాయకులు (TDP leaders), కార్యకర్తలు పెద్దఎత్తున హాజరయ్యారు. గాంధీ సర్కిల్‌ వద్ద టీడీపీ నేత వసంత్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన లోకేశ్‌ బొమ్మలున్న ఫ్లకార్డు కటౌట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నగరంలోని విజయం కాలేజీ విద్యార్థులు సరిగ్గా పాదయాత్ర సమీపంలోకి చేరినప్పుడు ఒక్కసారిగా అందరూ బయటికి వచ్చి లోకేశ్‌కు అభివాదం చేశారు. లోకేశ్‌ కూడా వారందరికీ కలిసి సెల్ఫీ దిగారు. నగరంలోని దర్గా సమీపంలో ముస్లిం సోదరులు లోకేశ్‌ చేతుల మీదుగా పావురాన్ని ఎగురవేశారు.

టీడీపీ కార్యకర్తలకు బెయిల్‌ మంజూరు

బంగారుపాళ్యంలో పాదయాత్ర సందర్భగా లోకేశ్‌ బహిరంగ సభ నిర్వహించకుండా పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. అప్పట్లో పోలీసులకు, టీడీపీ కార్యకర్తలకు వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో పోలీసులు నలుగురు టీడీపీ కార్యకర్తలు కేశవ, చరణ్‌, షబ్బీర్‌, అశోక్‌ల మీద 307 సెక్షన్‌ కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో ఆ సెక్షన్‌ వర్తించదని అభిప్రాయపడిన కోర్టు సోమవారం ఆ నలుగురికి బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో వారు సోమవారం చిత్తూరు శిబిరం వద్ద లోకేశ్‌ను కలిశారు. లోకేశ్‌ వారిని అభినందించి, అధికారంలోకి వచ్చాక తప్పుడు కేసుల్ని మాఫీ చేస్తామని హామీనిచ్చారు.

Updated Date - 2023-02-06T21:37:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising