ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viveka case: తగిన సమయంలో సమాధానం చెబుతా: అవినాశ్‌రెడ్డి

ABN, First Publish Date - 2023-03-06T21:41:52+05:30

హైదరాబాదు కోఠిలోని సీబీఐ కార్యాలయానికి విచారణకు ఈ నెల 10న హాజరుకావాల్సిందిగా సీబీఐ నోటీసులు ఇచ్చిందని కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి (MP YS Avinash Reddy) వెల్లడించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

కడప: హైదరాబాదు కోఠిలోని సీబీఐ కార్యాలయానికి విచారణకు ఈ నెల 10న హాజరుకావాల్సిందిగా సీబీఐ నోటీసులు ఇచ్చిందని కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి (MP YS Avinash Reddy) వెల్లడించారు. సోమవారం కడప జిల్లా (Kadapa District)లోని వేంపల్లెలో వైసీపీ కార్యక్రమానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘ఈ నెల 10న విచారణకు రావాలసిందిగా నాకు సీబీఐ నోటీసు (CBI Notices) ఇచ్చింది. 12న కడపకు విచారణకు రావాల్సిందిగా మా తండ్రికి నోటీసు ఇచ్చింది’ అని తెలిపారు. సీబీఐ విచారణ ఎలా సాగుతోంది అన్న మీడియా ప్రతినిధుల ప్రశ్నకు తగిన సమయంలో సమాధానం చెబుతానంటూ ఆయన వ్యాఖ్యానించారు. కాగా.. ఎంపీ అవినాశ్‌రెడ్డిని హైదరాబాదుకు, భాస్కర్‌రెడ్డి (Bhaskar Reddy)ని కడప సెంట్రల్‌ జైలు వద్దకు సోమవారం విచారణకు రావాల్సిందిగా సీబీఐ నోటీసులు జారీ చేసింది. తండ్రీ కొడుకులను ఒకేరోజు విచారణకు పిలవడం వైసీపీలో సంచలనం రేకెత్తించింది. అయితే తనకు ముందస్తు కార్యక్రమాలు ఉండటం వలన సోమవారం విచారణకు హాజరుకాలేనని ఎంపీ సీబీఐ అధికారులు లేఖ రూపంలో తెలియజేశారు. దీనికి ఆదివారం రాత్రి పొద్దుపోయే వరకూ సీబీఐ నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది. చివరకు తండ్రీ కొడుకుల విచారణ తేదీలను సీబీఐ మార్చింది. ఈ మేరకు 10న హైదరాబాదులో విచారణకు కొడుకు వైఎస్‌ అవినాశ్‌రెడ్డిని, 12న కడపలో తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డిని రావాలని నోటీసులు ఇచ్చింది.

Updated Date - 2023-03-06T21:41:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising