IMD: 14న బంగాళాఖాతంలో అల్పపీడనం.. కోస్తా, రాయలసీమలో మోస్తరు వర్షాలు
ABN, First Publish Date - 2023-11-12T08:51:11+05:30
ఈనెల 14న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రేపు దక్షిణ కోస్తా, రాయలసీమలో
అమరావతి: ఈనెల 14న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రేపు దక్షిణ కోస్తా, రాయలసీమలో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే.. ఈ అల్పపీడనం 16వతేదీ నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని తెలిపింది. మొత్తానికి దక్షిణ కోస్తా, రాయలసీమలో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Updated Date - 2023-11-12T08:51:13+05:30 IST