ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Godavari : గోదావరి నదికి పెరుగుతున్న వరద ఉధృతి.. ఏ క్షణమైనా మొదటి ప్రమాద హెచ్చరిక..!

ABN, First Publish Date - 2023-07-21T08:56:20+05:30

మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద ఉధృతి పెరుగుతోంది. నేడు భద్రాచలం వద్ద నీటిమట్టం 43.9 అడుగులకు చేరుకోగా.. పోలవరం వద్ద 11.97 మీటర్లకు చేరుకుంది. ధవళేశ్వరం వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 8.48 లక్షల క్యూసెక్కులుగా ఉంది. కాబట్టి నేడు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది.

అమరావతి : మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద ఉధృతి పెరుగుతోంది. నేడు భద్రాచలం వద్ద నీటిమట్టం 43.9 అడుగులకు చేరుకోగా.. పోలవరం వద్ద 11.97 మీటర్లకు చేరుకుంది. ధవళేశ్వరం వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 8.48 లక్షల క్యూసెక్కులుగా ఉంది. కాబట్టి నేడు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. వరద ఉధృతిని ఎప్పటికప్పుడు విపత్తుల సంస్థ పర్యవేక్షిస్తోంది. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల సంస్థ ఎండీ సూచిస్తున్నారు. సహాయక చర్యల్లో అధికారులకు సహకరించాలని కోరుతున్నారు.

తూర్పుగోదావరి : గంటగంటకూ గోదావరి వరద ప్రవాహం పెరుగుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నీటిమట్టం10.80 అడుగులకు చేరుకుంది. 175 గేట్లను అధికారులు ఇప్పటికే ఎత్తివేశారు. 8.50 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేశారు. విలీన మండలాల్లో శబరి నది పొంగి ప్రవహిస్తోంది. మరోవైపు వాగులన్నీ పొంగి ప్రవహిస్తున్నాయి.

ఇక అల్లూరి జిల్లాలో.. శబరి, గోదావరి నదులలో వరద ఉధృతి పెరుగుతోంది. చింతూరు ఏజెన్సీలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రహదారుల పైకి వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద భయంతో లోతట్టు వాసులు ఇళ్లు ఖాళీ చేస్తున్నారు. చింతూరులో బస చేసి వరద పరిస్థితిని అల్లూరి జిల్లా కలెక్టరు సుమీత్ కుమార్ సమీక్షిస్తున్నారు.

మరోవైపు నరసాపురం వద్ద గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. ఎగువ నుంచి వశిష్ట గోదావరిలోకి 2 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. గోదావరిలో చేపల వేట కోసం మత్స్యకారులు కట్టుకున్న వల కట్లను తొలగించారు. లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురి కాకుండా ముందస్తుగా స్లూయిస్ తలుపులు మూసివేశారు. రేవుల్లో నీటి మట్టాలను సబ్ కలెక్టర్ సూర్యతేజ పరిశీలించారు.

Updated Date - 2023-07-21T08:56:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising