ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Heart Attack : వెన్నులో వణుకు పుట్టిస్తున్న గుండెపోట్లు.. నేడు ఇంటర్ విద్యార్థి మృతి

ABN, First Publish Date - 2023-03-07T11:25:33+05:30

ఇటీవలి కాలంలో గుండెపోటు వార్త వినని రోజంటూ ఉండటం లేదు. ఈ వార్త వినిపిస్తేనే.. వెన్నులో వణుకు పుడుతోంది. చిన్న, పెద్దా వయసుతో సంబంధం లేకుండా ఈ గుండెపోట్లు మనుషుల ప్రాణాలను హరిస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

పల్నాడు : ఇటీవలి కాలంలో గుండెపోటు (Heart Attack) వార్త వినని రోజంటూ ఉండటం లేదు. ఈ వార్త వినిపిస్తేనే.. వెన్నులో వణుకు పుడుతోంది. చిన్న, పెద్దా వయసుతో సంబంధం లేకుండా ఈ గుండెపోట్లు మనుషుల ప్రాణాలను హరిస్తున్నాయి. నేడు ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి (Inter Student) ఒకరు గుండెపోటుతో మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. చిలకలూరిపేట మండలం పసుమర్రుకు చెందిన ఎస్కే ఫిరోజ్ (17).. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. రాత్రి అందరితో కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేసి.. హాయిగా నిద్రపోయాడు. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో గుండె నొప్పిగా ఉందంటూ కేకలు వేశాడు. దీంతో వెంటనే పక్కనున్నవారు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యలోనే మృతి చెందాడు.

ఇటీవల వరుడికి చందనం రాస్తూ ఒకరు.. జిమ్ చేస్తూ ఒకరు.. లిఫ్ట్ డోర్ వద్ద నిలబడి ఒకరు.. బ్యాడ్మింటన్ ఆడుతూ.. డ్యాన్స్ చేస్తూ ఇలా ఎందరో ప్రాణాలను కోల్పోయారు. వీరంతా 50 ఏళ్ల లోపు వారే. మూడు రోజుల క్రితం కూడా ఒకే ఊరుకు చెందిన ఇద్దరు వ్యక్తులు కేవలం గంటల వ్యవధిలో గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఇక ఇటీవలి కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలామంది గుండెపోటు, కార్డియాక్‌ అరెస్ట్‌ వంటి సమస్యలతో ప్రాణాలు కోల్పోతున్నారు. రెండేళ్లపాటు ప్రపంచాన్ని గడగడలాడించిన కొవిడ్‌-19 మహమ్మారి జోరు తగ్గాక.. నమోదవుతున్న ఇలాంటి హఠాన్మరణాలు పలు సందేహాలకు కారణమవుతున్నాయి. కొవిడ్‌-19 కారణంగా కొందరిలో గుండెపై తీవ్ర ప్రభావం పడుతోందని కొన్ని అధ్యయనాల్లో వెల్లడి కాగా.. వ్యాక్సిన్ల వల్ల కూడా రక్తంలో గడ్డలు ఏర్పడి గుండెపోటు, బ్రెయిన్‌స్ట్రోక్‌ వంటివి సంభవిస్తున్నాయని మరికొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

Updated Date - 2023-03-07T11:25:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising