ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ISRO: మరో నావిగేషన్‌ ఉపగ్రహ ప్రయోగానికి ఇస్రో సన్నాహం

ABN, First Publish Date - 2023-05-17T19:48:25+05:30

మరో నావిగేషన్‌ ఉపగ్రహ ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) సన్నాహాలు చేస్తోంది. శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్‌ థావన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి ఈ నెల 29న జీఎస్‌ఎల్వీ-మార్క్‌ 2 రాకెట్‌ ఎన్‌వీఎస్-01 నావిగేషన్‌ ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనున్నారు. షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి జరిగే ఈ రాకెట్‌ అనుసంధాన పనులను శాస్త్రవేత్తలు శరవేగంగా చేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూళ్లూరుపేట: మరో నావిగేషన్‌ ఉపగ్రహ ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) సన్నాహాలు చేస్తోంది. శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్‌ థావన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి ఈ నెల 29న జీఎస్‌ఎల్వీ-మార్క్‌ 2 (GSLV-Mark 2) రాకెట్‌ ఎన్‌వీఎస్-01 నావిగేషన్‌ ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనున్నారు. షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి జరిగే ఈ రాకెట్‌ అనుసంధాన పనులను శాస్త్రవేత్తలు శరవేగంగా చేస్తున్నారు. 2016 ఏప్రిల్‌ 28న పీఎస్‌ఎల్వీ-సీ 35 (PSLV-C 35) రాకెట్‌ ద్వారా ప్రయోగించిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1జీ ఉపగ్రహ కాల పరిమితి ముగిసిపోవడంతో దాని స్థానంలో ఇస్రో ఈ ఉపగ్రహాన్ని పంపనుంది. దేశంలో సొంత నావిగేషన్‌ వ్యవస్థకు ఇస్రో శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగానే ఇస్రో (ISRO) ఎన్‌వీఎస్-01 ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు సన్నద్ధమవుతోంది. ఇది విజయవంతమైతే 12 సంవత్సరాల పాటు సేవలందించనుంది. దేశంలోని పొజిషనింగ్‌, నావిగేషన్‌, టైమింగ్‌ అవసరాలను తీర్చడానికి నావిగేషన్‌ విత్‌ ఇండియన్‌ కన్సల్టేషన్‌ (నావిక్‌)ను ఇస్రో ఏర్పాటు చేస్తోంది. ఏప్రిల్‌లో ప్రయోగించిన పీఎస్‌ఎల్వీ-సీ 55 రాకెట్‌ విజయవంతం కావడంతో అదే ఉత్సాహంతో శాస్త్రవేత్తలు నావిక్‌ ఉపగ్రహ ప్రయోగం చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నావిక్‌ ప్రయోగం అయిన వెంటనే చంద్రయాన్‌-3 (Chandrayaan-3) ప్రయోగం కూడా జూన్‌ మాసంలో నిర్వహించేందుకు ఇస్రో సన్నద్ధమవుతోంది.

Updated Date - 2023-05-17T19:48:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising