Nara Lokesh: కాపు సామాజిక వర్గాన్ని జగన్ దారుణంగా మోసం చేశారు: నారా లోకేశ్
ABN, First Publish Date - 2023-12-12T18:46:34+05:30
జగన్‌మోహన్ రెడ్డి పాలనలో కాపు సామాజికవర్గాన్ని దారుణంగా మోసం చేశాడని టీడీపీ జాతీయ ప్రధాన నారా లోకేశ్ అన్నారు. అధికారంలోకి వస్తే కాపులకు రిజర్వేషన్, కాపు కార్పొరేషన్‌కు ఏటా రూ.2 వేల కోట్ల బడ్జెట్ కేటాయిస్తానని హామీ ఇచ్చిన జగన్ ముఖం చాటేశారని మండిపడ్డారు.
అనకాపల్లి: జగన్‌మోహన్ రెడ్డి పాలనలో కాపు సామాజికవర్గాన్ని దారుణంగా మోసం చేశాడని టీడీపీ జాతీయ ప్రధాన నారా లోకేశ్ అన్నారు. అధికారంలోకి వస్తే కాపులకు రిజర్వేషన్, కాపు కార్పొరేషన్‌కు ఏటా రూ.2 వేల కోట్ల బడ్జెట్ కేటాయిస్తానని హామీ ఇచ్చిన జగన్ ముఖం చాటేశారని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర తూర్పుకాపులకు బీసీ-డీ సర్టిఫికెట్లు నిలిపేయడం దారుణమని వ్యాఖ్యానించారు. కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించాలన్న గత నిర్ణయానికి టీడీపీ కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. కాపు కార్పొరేషన్‌కు బడ్జెట్‌లో నిధులు కేటాయించి, పేద కాపులకు చేయూతనిస్తామని అన్నారు. ఎటువంటి షరతులు, నిబంధనలు లేకుండా ఉత్తరాంధ్ర తూర్పుకాపులకు బీసీ-డీ సర్టిఫికెట్లు మంజూరు చేస్తామన్నారు.
పాయకరావుపేట నియోజకవర్గం చినదొడ్డిగల్లులో నారా లోకేశ్‌ని కాపు సామాజికవర్గీయులు కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లోని తూర్పుకాపులకు బీసీ-డీ కుల సర్టిఫికెట్లు ఇవ్వాలని జీఓ ఎంఎస్ 1793లో ఉందని, ఈ జీవోను పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్.రాయవరం, కోటఉరట్ల మండలాల్లో ఎమ్మార్వోలు అమలుచేయడం లేదని కాపు ప్రతినిధులు నారా లోకేశ్‌ను కోరారు.
Updated Date - 2023-12-12T18:46:35+05:30 IST