ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Yuvagalam Padayatra: జగన్‌కు ప్రజల కష్టాలు పట్టడం లేదు: లోకేశ్‌

ABN, First Publish Date - 2023-06-10T21:25:43+05:30

ఎన్నికలకు ముందు అలవికాని హామీలిచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలను మోసం చేశారు. ప్రజల కష్టాలు పట్టడం లేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: ‘‘ఎన్నికలకు ముందు అలవికాని హామీలిచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలను మోసం చేశారు. ప్రజల కష్టాలు పట్టడం లేదు. ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి దోచుకోవడం, దాచుకోవడానికే పరిమితమయ్యారు’’ అని టీడీపీ నేత నారాలోకేశ్‌ (Nara Lokesh) దుయ్యబట్టారు. యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra) 122వ రోజు రాజంపేట నియోజకవర్గం సిద్దవటం మండలంలోని జంగాలపల్లె విడిది కేంద్రం నుంచి ఉదయం 8:30గంటలకు మొదలైంది. నారా లోకేశ్‌ దాదాపు 12కిలోమీటర్ల మేర లంకమల ఫారెస్టులో నడిచి కడప జిల్లా (Kadapa District) బద్వేలు నియోజకవర్గంలోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా జనం దారిపొడవునా లోకేశ్‌కు వివిధ సమస్యలపై వినతిపత్రాలు అందించారు. ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ జగన్‌కు కొత్తగా ప్రాజెక్టులు కట్టడం చేతకాదని, కనీసం ముంపువాసులకు పరిహారం ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేయడం దారుణమన్నారు. శెట్టివారిపల్లెకు పరిహారం ఇవ్వాలంటూ ప్రభుత్వానికి లేఖ రాస్తానన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే టీడీపీ వచ్చిన వెంటనే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ దొంగల ఇసుక దాహం రాష్ట్ర ప్రజలకు శాపంగా మారిందని లోకేశ్‌ ధ్వజమెత్తారు.

Updated Date - 2023-06-10T21:25:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising