LokeshPadayatra: డ్వాక్రా సంఘాలను జగన్ నిర్వీర్యం చేశారు: లోకేష్
ABN, First Publish Date - 2023-02-06T16:15:21+05:30
డ్వాక్రా సంఘాలను సీఎం జగన్ (CM Jagan) నిర్వీర్యం చేశారని టీడీపీ నేత నారా లోకేష్ (NaraLokesh) దుయ్యబట్టారు. చిత్తూరు (Chittoor)లో మహిళలతో లోకేష్ ముఖాముఖి నిర్వహించారు.
చిత్తూరు: డ్వాక్రా సంఘాలను సీఎం జగన్ (CM Jagan) నిర్వీర్యం చేశారని టీడీపీ నేత నారా లోకేష్ (NaraLokesh) దుయ్యబట్టారు. చిత్తూరు (Chittoor)లో మహిళలతో లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. టీడీపీ (TDP) అధికారంలో ఉన్నప్పుడు మహిళలకు డ్వాక్రా సంఘాల ద్వారా ఆర్థికసాయం చేశామని తెలిపారు. మద్య నిషేధం చేస్తామని మహిళలను జగన్‌రెడ్డి మోసం చేశారని మండిపడ్డారు. జగన్‌రెడ్డి పాలనలో మహిళలకు రక్షణలేకుండా పోయిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. లేని దిశ చట్టం పేరుతో గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. చెల్లికి, తల్లికి న్యాయం చేయలేనోడు సామాన్యులకు ఏం చేస్తాడు? అని లోకేష్ ప్రశ్నించారు. ఏపీలో నిత్యావసరాల ధరలు పెంచి ప్రజలపై భారం మోపారని దుయ్యబట్టారు. టీడీపీ ప్రభుత్వం రాగానే పన్నులు తగ్గించి.. ధరలు అందుబాటులోకి తెస్తామని లోకేష్ ప్రకటించారు.
యువగళం పాదయాత్ర (YuvaGalamPadayatra) 11వ రోజు (6-02-2023) సోమవారం షెడ్యూల్ వివరాలు
లోకేష్ 'యువగళం' పాదయాత్ర 11వ రోజుకు చేరింది.
8.00 మంగసముద్రంలోని విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభం.
8.15 బీడీ కాలనీ, లెనిన్ నగగర్, సంతపేటలో బీడీవర్కర్లతో భేటీ
9.40 చిత్తూరు కోర్టు సర్కిల్‌లో లాయర్లతో ముఖాముఖి
10.05 గాంధీ సర్కిల్ వద్ద స్థానిక నాయకులతో మాటామంతి
10.25 ఎంఎస్ఆర్ సర్కిల్‌లో స్థానిక నాయకులతో మాటామంతి
10.45 అంబేద్కర్ సర్కిల్ వద్ద ముస్లిం పెద్దలతో మాటామంతి
11.20 గ్రీమ్స్ పేటలో పార్టీ నాయకులతో మాటామంతి
12.10 అమర్ రాజా ప్రాంగణంలో పక్కనున్న టీడీడీ కళ్యాణమండపంలో మహిళలతో ముఖాముఖి
12.55 అమర్ రాజా ప్రాంగణం పక్కనున్న టీడీడీ కళ్యాణ మండపం ప్రాంగణంలో భోజన విరామం
1.55 పాదయాత్ర పునఃప్రారంభం
3.05 టీడీపీ జిల్లా కార్యాలయం వద్ద ఎస్సీ సామాజికవర్గీయులతో భేటీ
4.20 టీడీపీ కార్యాలయంలో యువతతో ముఖాముఖి.
5.20 కుంగరెడ్డిపల్లి కెఆర్ నగర్ కాలనీ విడిది కేంద్రంలో బస
Updated Date - 2023-02-06T16:15:22+05:30 IST