Jagan lawyer: మంత్రి బొత్స మేనల్లుడు వ్యవహారంపై స్పందించిన సీఎం జగన్ న్యాయవాది
ABN, First Publish Date - 2023-08-30T21:29:25+05:30
మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa) మేనల్లుడు వ్యవహారంపై కోడి కత్తి కేసులో నిందితుడు తరపు న్యాయవాది వ్యాఖ్యలపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తరపు న్యాయవాది (Jagan lawyer) ఇనకొల్లు వెంకటేశ్వర్లు స్పందించారు.
విజయవాడ: మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa) మేనల్లుడు వ్యవహారంపై కోడి కత్తి కేసులో నిందితుడు తరపు న్యాయవాది వ్యాఖ్యలపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తరపు న్యాయవాది (Jagan lawyer) ఇనకొల్లు వెంకటేశ్వర్లు స్పందించారు.
"రెండు దర్యాప్తు సంస్ధల విచారణలో బొత్స మేనల్లుడు పేరు ఎపుడూ రాలేదు. ప్రభుత్వ ఒత్తిడితో విశాఖ కోర్టుకు కేసు బదిలీ అనేది నిజం కాదు. ఎన్ఐఏ కేవలం 6 రోజులలోనే సాక్షులని విచారించి ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఎటువంటి ఆధారాలు సేకరించకుండానే ఛార్జిషీటు వేశారు. దర్యాప్తు సమగ్రంగా జరగాలి అని ఇప్పటికీ కోరుతున్నాం. ఈ హత్యాయత్నం వెనుక ఎవరూ ఉన్నారో దర్యాప్తులో తేలాలి. మరింత లోతైన విచారణ జరగాలి అని సీఎం వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది అనే ప్రశ్నకు నేరుగా సమాధానం ఇవ్వని జగన్ న్యాయవాది. సీఎం సాక్ష్యంగా రానని ఎపుడూ చెప్పలేదు. సాక్ష్యం కోసం కోర్టుకు రావడానికి ఉన్న ఇబ్బందులను సీఎం వైఎస్ జగన్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సీఎం జగన్ కోర్టుకు వస్తే చుట్టుపక్కల న్యాయస్థానాలకు, కక్షిదారులకు ఇబ్బంది కలుగుతుందని ఆ పిటిషన్ దాఖలు చేశాం. కమిషనర్ ద్వారా సాక్ష్యం కోసం విచారణ జరపాలని సీఎం వైఎస్ జగన్ కోర్డును కోరారు. పిటిషన్‌ను కొట్టేసిన తరువాత కూడా కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుందో చూద్దామంటూ పేర్కొన్న జగన్ తరపు న్యాయవాది. ఎన్ఐఏ కేసు తప్పుదోవ పట్టించారని ఎపుడూ అనలేదు. పూర్తిస్ధాయిలో దర్యాప్తు జరగాలని మాత్రమే కోరుతున్నాం." అని ఇనకొల్లు వెంకటేశ్వర్లు అన్నారు.
Updated Date - 2023-08-30T21:29:25+05:30 IST