ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrababu: రైతులను మోసం చేశారంటూ జగన్‌పై చంద్రబాబు ఫైర్.. వైసీపీని బంగాళాఖాతంలో...

ABN, First Publish Date - 2023-08-08T19:43:00+05:30

ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై (CM JAGANMOHAN REDDY) టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై (Chandrababu) విమర్శలు గుప్పించారు.

రాజమండ్రి: ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై (CM JAGANMOHAN REDDY) టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై (Chandrababu) విమర్శలు గుప్పించారు.


"2 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలనే లక్ష్యంతో పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ప్రారంభించాం. పురుషోత్తపట్నం పధకానికి భూములు ఇచ్చిన రైతులను మోసం జగన్ చేశారు. రాజమండ్రి నుంచి పురుషోత్తపట్నంకు వచ్చే రోడ్డు గోతులతో నా నడుం ఇరిగిపోయింది. రోడ్డుపై దుమ్మంతా నా కడుపు నిండా ఉంది. ప్రజావేదిక మాదిరిగానే పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం కూల్చేసావారు. రాజానగరం ఎమ్మెల్యే పనికిమాలిన వారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా రైతులకు నష్టపరిహారం ఇస్తాను. రాజమండ్రి నుంచి పురుషోత్తంపట్నం వరకు రోడ్డు నిర్మాణం చేపడతాను. మోసం చేసే వైసీపీ పార్టీని ఓడించి బంగాళాఖాతంలో కలపాలి." అని చంద్రబాబు అన్నారు.


చంద్రబాబుని కలిసి పురుషోత్తపట్నం రైతులు తమగోడును విన్నవించుకున్నారు. 70 ఎకరాలకు సంబంధించిన నష్టపరిహారం 85 మంది రైతులకు వైసీపీ ప్రభుత్వం ఇవ్వలేదంటూ చంద్రబాబుకు రైతులు తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆదుకోవాలని చంద్రబాబును రైతులు కోరారు. అంతకు ముందు చంద్రబాబు పురుషోత్తపట్నం చేరుకున్నారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం తొలిదశ పనులను చంద్రబాబు పరిశీలించారు. రాజమహేంద్రవరం నుంచి పురుషోత్తపట్నం వరకు 4 పాటు చంద్రబాబు ప్రయాణం దాదాపు 35 కిలోమీటర్లు సాగింది. పూర్తిగా దెబ్బతిన్న రహదారిపై తీవ్ర ఇబ్బందులు పడుతూ చంద్రబాబు పర్యటన సాగించారు. రాజా నగరం నియోజకవర్గంలో ప్రతీ గ్రామంలో చంద్రబాబుకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని వైసీపీ (YCP) అటకెక్కించిందంటూ చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం గురించి చంద్రబాబుకు జలవనరుల శాఖ అధికారులు వివరించారు. పంపు హౌస్‌లను చంద్రబాబు పరిశీలించారు. పంపు హౌస్ ప్రాంతమంతా చంద్రబాబు తిరిగి పరిస్థితిని తెలుసుకున్నారు.

Updated Date - 2023-08-08T19:45:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising