Pawan Kalyan: ముఖ్యమంత్రి పదవిపై ఢిల్లీలో పవన్ సంచలన వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2023-07-18T16:14:08+05:30
చ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసే అవకాశం ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఢిల్లీలో జాతీయ మీడియాతో జనసేనాని మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వాన్ని సాగనంపడానికి అందరూ కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు.
న్యూఢిల్లీ: వచ్చే ఎన్నికల్లో టీడీపీ (TDP), జనసేన (Janasena), బీజేపీ (BJP) కలిసి పోటీ చేసే అవకాశం ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan) సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఢిల్లీలో జాతీయ మీడియాతో జనసేనాని మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వాన్ని సాగనంపడానికి అందరూ కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. కూటమిలో ముఖ్యమంత్రి ఎవరన్నది ఎన్నికల ఫలితాల్లో బలాబలాలను బట్టి నిర్ణయం ఉంటుందన్నారు. తనకు ముఖ్యమంత్రి పదవి ముఖ్యం కాదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో విచ్చల విడిగా అవినీతి జరుగుతోందని ఆరోపించారు. ఉద్యోగాలు లేవని.. 1న జీతాలు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. డేటా చోర్యం జరుగుతోందని తెలిపారు. రోజుకి రూ.160 జీతం ఇచ్చి పెట్టుకున్న ప్రైవేటు వ్యక్తుల ద్వారా ప్రజల డేటా అంతా చోర్యం చేస్తున్నారని ఆరోపించారు. ఆధార్, వేలిముద్రలు, ఐరిష్ డేటా అంతా తెలంగాణలో నిక్షిప్తం చేస్తున్నారన్నారు. ప్రజా వ్యతిరేకతను ఎదురించే వారు కావాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. అందుకే జనసేనకు ఏపీలో ప్రజల నుంచి మద్దతు వస్తోందన్నారు. రాష్ట్రంలో ప్రజలు తీవ్ర నిరాశ నిస్పృహతో ఉన్నారన్నారు. మీడియాలో కనిపిస్తున్న దానికి వాస్తవ పరిస్థితులకు పొంతన లేదని చెప్పారు. కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు చెల్లించే పరిస్థితి లేదన్నారు. తనకు అనుకూలంగా ఉన్న వారికి మాత్రం పది శాతం వడ్డీతో రుణాలు తీసుకొచ్చి రాష్ట్ర సొమ్మును ధారాదత్తం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated Date - 2023-07-18T16:39:46+05:30 IST