ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vizag steel: వైజాగ్ స్టీల్‌‌‌ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కీలక ప్రకటన.. జనసేనాని పవన్ కళ్యాణ్ రియాక్షన్ ఇదే.. ఏమన్నారంటే..

ABN, First Publish Date - 2023-04-13T17:38:33+05:30

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ (Vizag Steel Plant Privatization) విషయంలో ప్రస్తుతానికి ముందుకెళ్లడం లేదంటూ కేంద్ర మంత్రి ఫగ్గన్‌సింగ్ కులస్తే (Faggan Singh Kulaste) చేసిన ప్రకటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ (Vizag Steel Plant Privatization) విషయంలో ప్రస్తుతానికి ముందుకెళ్లడం లేదంటూ కేంద్ర మంత్రి ఫగ్గన్‌సింగ్ కులస్తే (Faggan Singh Kulaste) చేసిన ప్రకటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. కేంద్రమంత్రి ప్రకటన ఆశాజనకంగా ఉందన్నారు. విశాఖ ఉక్కు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వానికి విశాఖ ఉక్కును కాపాడాలనే చిత్తశుద్ధి లేదని,

విశాఖ ఉక్కు అనేది తెలుగువారి భావోద్వేగాలతో ముడిపడిన పరిశ్రమ అని వ్యాఖ్యానించారు. 32 మంది ప్రాణ త్యాగాలతో... ప్రాంతాలకు అతీతంగా సాగిన ఉద్యమాల ఫలితంగా సిద్ధించినదే విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రస్తావించారు. ఇంతటి ఘన నేపథ్యమున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ఎప్పుడూ కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలోనే ఉండాలన్నది జనసేన పార్టీ ఆకాంక్ష అని స్పష్టం చేశారు.

ఈ పరిశ్రమ ప్రయివేటీకరణ అంశం ప్రకటన వచ్చినప్పుడు స్పందించి ఢిల్లీ వెళ్ళి బీజేపీ అగ్రనాయకత్వాన్ని కలిసినప్పుడు వారు సానుకూలంగానే పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆ స్పందన ఎంతో ఆశావాహంగా కనిపించిందన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాని కలిసి విశాఖ ఉక్కుతో తెలుగు ప్రజలకున్న భావోద్వేగ బంధాన్ని తెలియచేసి ఈ పరిశ్రమను ప్రత్యేకంగా చూడాలని కోరానని ప్రస్తావించారు. ఈ రోజు కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగన్ సింగ్ కులస్తే ‘విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఇప్పటికిప్పుడు ప్రైవేటుపరం చేయాలనుకోవడం లేదు. దీనిపై ప్రస్తుతానికి ముందుకెళ్లడం లేదు’ అని చేసిన ప్రకటన హర్షణీయమని అన్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఎందరో రైతులు తమ భూములను త్యాగం చేశారని, ఇందులో కొందరికి ఇప్పటికీ సెటిల్మెంట్ కాలేదని పేర్కొన్నారు. ఇలాంటి పరిశ్రమపై రాష్ట్ర పాలకులు సైతం ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. వారికి తొలి నుంచీ చిత్తశుద్ధి లోపించిందని విమర్శించారు. జనసేన పక్షాన స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతుగా నిలవడంతోపాటు భారీ బహిరంగ సభ నిర్వహించి రాష్ట్ర పాలకులు అఖిలపక్షాన్ని తీసుకొని కేంద్ర ప్రభుత్వం దగ్గరకు వెళ్లాలని విజ్ఞప్తి చేసినా వైసీపీ పాలకులు స్పందించలేదని మండిపడ్డారు. జనసేన పార్టీ ప్రతి సందర్భంలో కేంద్ర నాయకత్వం, కేంద్ర మంత్రులతో చర్చించినప్పుడు విశాఖ ఉక్కును పరిరక్షించాలని బలంగా చెప్పామని పవన్ అన్నారు.

కొద్ది రోజుల కిందట పొరుగు రాష్ట్రం ఈ అంశంలో స్పందించింది. దీని వెనక ఉన్న రాజకీయ ప్రయోజనాలు, నేపథ్యాలపై వైసీపీ పాలకులు విమర్శలు చేస్తున్నారే తప్ప పరిశ్రమ కాపాడుతామనే మాట చెప్పలేకపోయారని వైసీపీ నాయకులకుపై పవన్ విమర్శించారు. చిత్తశుద్ధి లేని రాష్ట్ర పాలకుల వల్ల విశాఖ ఉక్కు పరిరక్షణ అంశం ముందుకు వెళ్లలేదని వాపోయారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి చేసిన ప్రకటన కొత్త ఆశలు రేపిందని, జనసేన పార్టీ తొలి నుంచి ఈ పరిశ్రమను పరిరక్షించాలనే కోరుతోందని, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్‌ను బలోపేతం చేయాలని నిర్ణయించిన దృష్ట్యా విశాఖ ఉక్కు బలపడుతుందని భావిస్తున్నానని పవన్ కళ్యాణ్ చెప్పారు.

ఇవి కూడా చదవండి...

Vizag Steel Plant Privatization: వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం వెనక్కి తగ్గినట్టేనా..?

Kavitha on Sukesh : సుఖేష్‌ చంద్రశేఖర్‌‌ రిలీజ్ చేసిన వాట్సాప్ చాట్‌పై కవిత రియాక్షన్ ఇదీ.. మీడియాకే ఛాలెంజ్ చేస్తూ..

Updated Date - 2023-04-13T17:49:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising