Janasena leader Nagababu: సాక్షిలో రాసిన వార్తపై జనసేన నేత నాగబాబు ఫైర్
ABN, First Publish Date - 2023-09-24T16:33:32+05:30
సాక్షిలో (Sakshi) రాసిన వార్తపై జనసేన నేత నాగబాబు (Janasena leader Nagababu) ఫైర్ అయ్యారు.
"జనసేన కింద టీడీపీ పని చేస్తుందని మీ పేపర్లో రాస్తారా?. మీకు సమాధానం చెప్పటం కూడా వృధా అని నాగబాబు సాక్షి విలేకరితో చెప్పారు. జనసేన, టీడీపీ పొత్తులో భాగంగా తిరుపతిలో ఎవరు పోటీ చేయాలో సాక్షి పత్రిక వాళ్లే నిర్ణయం తీసుకుంటారా? అని ప్రశ్నించారు.
"రాష్ట్ర ప్రజల కర్మ మూడు, నాలుగు నెలల్లో తీరిపోతుంది. ఒకరు దెబ్బతిన్నపుడు తొక్కేసి పైకి రావాలని, పుంజుకోవాలనే అవకాశ రాజకీయాలు, నీచమైన రాజకీయాలు జనసేన చేయదు. చంద్రబాబును కారణం లేకుండా జైళ్లో పెట్టారు. టీడీపీకి, చంద్రబాబుకు సపోర్టుగా మేము మీకు ఉన్నాం. ఆయనపైన కేసులు పడ్డాయి అని చంకలు గుద్దుకునే పరిస్థితి మాకు లేదు. జనసేనలోని 90 శాతం మంది చంద్రబాబు పట్ల, పొత్తు పట్ల పాజిటీవ్ గానే ఉన్నారు. ప్రజాస్వామ్య అందరూ ఒకే నిర్ణయానికి రావాలని లేదు. ఎంత గొప్పవారు తీసుకున్న నిర్ణయంలోనైనా కొంత వ్యతిరేఖత ఉంటుంది. దాన్ని మేము పరిగణలోకి తీసుకోవటం లేదు. ఎవరు సీఎం అవ్వాలనే దాని కంటే, పార్టీ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. ఎవరు సీఎం అనేది కాలం నిర్ణయిస్తుంది. చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తున్నా కేసులు పెడుతున్నారు. కేసులకు భయపడం. మాకు చాలా స్ట్రాంగ్ లీగల్ టీం ఉంది. బిజెపి నుంచి త్వరలో నిర్ణయం వస్తుంది. ప్యాకేజీ అంటే చెప్పుతీసుకుని కొడతాం. జనసేనలో నాయకత్వ లోపం లేదు. 200 కోట్ల రూపాయలు దోచేసి, భయభ్రాతులను చేసే నాయకులు లేక పోవచ్చు. ఉన్న వారు మంచి నేతలే ఉన్నారు. రాయలసీమలో వారాహీ యాత్ర చాలా స్ర్టాంగ్ గా ఉంటుంది. మా పార్టీ తరపున ఎవరు ఎక్కడ పోటీ చేస్తారో పవన్ కల్యాణ్ ప్రకటిస్తారు." అని నాగబాబు అన్నారు.
Updated Date - 2023-09-24T16:33:44+05:30 IST