ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Pulivendula: నేను పులివెందుల బిడ్డనే.. నిన్ను చంపకుండా వదిలిపెట్టను..!

ABN, First Publish Date - 2023-03-29T16:41:06+05:30

పులివెందుల (Pulivendula) కాల్పుల ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

కడప: పులివెందుల (Pulivendula) కాల్పుల ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కాల్పోల్లో మృతి చెందిన దిలీప్ (Dilip) తల్లి మస్తానమ్మ కన్నీరుమున్నీరుగా రోదిస్తుంది. వేంపల్లెపోస్టు మార్టం రూమ్ వద్ద దిలీప్‌ను చంపిన భరత్‌పై మృతుని తల్లి మస్తానమ్మ ఆగ్రహం వ్యక్తం చేసింది. నమ్మించి మోసం చేసిన భరత్ యాదవ్‌ (Bharat kumar Yadav)ను ఉరి తీయాలని ఆమె డిమాండ్ చేశారు. తాను పులివెందులలో పుట్టిన బిడ్డనే భరత్ యాదవ్‌ను చంపకుండా వదిలి పెట్టనని సవాల్ విసిరారు. ‘‘వైసీపీ చుట్టు మా కుటుంబ సభ్యులు తిరిగారని, జగన్ (Jagan) సార్ నువ్ పులివెందుల వ్యక్తివే కదా నా కడుపు కోత మిగిల్చిన వాన్ని ఉరి తీసేలా చూడండి’’ అని ఆమె గుండెలు బాదుకుంటూ రోదించారు. తన బిడ్డ ఏ తప్పు చేయలేదు, ఏ కక్ష పెట్టుకొని భరత్ చంపాడో తెలిదన్నారు.

ఇదిలావుండగా... వైఎస్సార్‌ జిల్లా పులివెందులలో పట్టపగలు దారుణ హత్య జరిగింది. ఆర్ధిక లావాదేవీలు అప్పుకు వడ్డీ చెల్లించలేదనే అక్కసుతో కాల్పులు జరపడంతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. సీఎం జగన్‌ సొంత నియోజక వర్గం పులివెందులలో పట్టపగలు అంతా చూస్తుండగానే గొర్లె భరత్‌కుమార్‌ యాదవ్‌ అనే వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో దిలీప్‌ ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

Updated Date - 2023-03-29T16:41:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising