BJP: జగన్ అవినీతి చిట్టాను తయారు చేసిన బీజేపీ
ABN, First Publish Date - 2023-08-03T14:01:01+05:30
న్యూఢిల్లీ: జగన్మహన్ రెడ్డి పాలన అవినీతి మయమని పేర్కొంటూ.. జగన్ అవినీతి చిట్టాను బీజేపీ అధిష్టానం తయారు చేసింది. ప్రధాని మోదీ సమక్షంలో దక్షిణాది ఎంపీలకు జగన్ అవినీతిని బీజేపీ బట్టబయలు చేసింది.
న్యూఢిల్లీ: జగన్మహన్ రెడ్డి (Jaganmohan Reddy) పాలన అవినీతి మయమని పేర్కొంటూ.. జగన్ అవినీతి చిట్టాను బీజేపీ (BJP) అధిష్టానం తయారు చేసింది. ప్రధాని మోదీ (PM Modi) సమక్షంలో దక్షిణాది ఎంపీలకు జగన్ అవినీతిని బీజేపీ బట్టబయలు చేసింది. గురువారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్యంలో దక్షిణాది రాష్ట్రాల ఎన్డీయే (NDA) ఎంపీల సమావేశం జరిగింది. ఈ భేటీలో ప్రదర్శించిన వీడియోలను పిఎంవో (PMO) తయారుచేసినట్లు సమాచారం. ఏపీ (AP)లో ల్యాండ్ (Land), శాండ్ (Sand), లిక్కర్ (Liquor) కుంభకోణాల భాగోతాలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించారు. అమరావతిని నాశనం చేసి రాజధాని లేని రాష్ట్రంగా మార్చారని జగన్ పాలనపై బీజేపీ నివేదిక తయారు చేసింది. ఏపీ, తెలంగాణ (Telangana) ప్రభుత్వాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని ఎన్డీయే ఎంపీల సమావేశంలో వీడియోలను ప్రదర్శించారు.
జగన్ పాలనలో జరుగుతున్న అవినీతిని ఎంపీలకు అర్ధమయ్యేలా బీజేపీ అధిష్టానం వీడియోల ద్వారా సవివరంగా ప్రదర్శించింది. ఏపీలో ల్యాండ్, శాండ్, మద్యం, విద్యుత్ కుంభకోణాలు, గంజాయి విక్రయాల గురించి వివరించింది. జగన్ పాలన మొత్తం అవినీతి మయంగా మారిందని వీడియోల ద్వారా వివరించింది.
అటు తెలంగాణలో కేసీఆర్ పాలనలోనూ అవినీతి విపరీతంగా పెరిగిపోయినట్లు బీజేపీ అధిష్టానం ఎంపీలకు వివరించింది. కాలేశ్వరం అవినీతితో పాటు, ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత (Kavitha) పాత్రపైనా వీడియోల ప్రదర్శన చేశారు. ఈ సమావేశానికి మోదీ సహా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా (JP Nadda) హాజరయ్యారు. అలాగే ఏపీ నుంచి సిఎం రమేశ్, వై.సత్యకుమార్, ఏపీ వ్యవహారాల ఇన్చార్జ్ సునీల్ దియోదర్ పాల్గొన్నారు. తెలంగాణ నుంచి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ కె.లక్ష్మణ్ హాజరయ్యారు. పార్లమెంటు సమావేశాల తరువాత జగన్, కేసీఆర్ అవినీతి పాలనపై ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఎంపీలకు ప్రధాని మోదీ ఆదేశించారు.
Updated Date - 2023-08-03T14:01:01+05:30 IST