ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kadapa.. 3 దశల్లో స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణం: సీఎం జగన్‌

ABN, First Publish Date - 2023-02-15T15:15:25+05:30

కడప: ఉక్కు పరిశ్రమ (Steel Industry)కు సీఎం జగన్‌రెడ్డి (CM Jagan) బుధవారం మరోసారి భూమిపూజ చేశారు. జమ్మలమడుగు మండలం, సున్నపురాళ్లపల్లె దగ్గర స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణం జరుగనుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: ఉక్కు పరిశ్రమ (Steel Industry)కు సీఎం జగన్‌రెడ్డి (CM Jagan) బుధవారం మరోసారి భూమిపూజ చేశారు. జమ్మలమడుగు మండలం, సున్నపురాళ్లపల్లె దగ్గర స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణం జరుగనుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణం 3 దశల్లో (3 Steps) జరుగుతుందన్నారు. 36 నెలల్లో రూ.3,300 కోట్లతో తొలిదశ నిర్మాణం జరుగుతుందని, మరో ఐదేళ్లలో పరిశ్రమ నిర్మాణం పూర్తవుతుందని స్పష్టం చేశారు. రూ.4 వేల కోట్లతో 3500 ఎకరాల భూమి .. రూ. 700 కోట్లతో మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తోందని సీఎం జగన్‌ వెల్లడించారు.

స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో మొత్తం కడప జిల్లా, ప్రాంతమంతా అభివృద్ధి అవుతుందని సీఎం జగన్ అన్నారు. గతంలో వైఎస్ ఎన్నో కలలు కన్నారని.. నాడు స్టీల్ ప్లాంట్ కోసం పరితపించారని.. తరువాత వచ్చిన ప్రభుత్వాలు పట్టించు కాలేదని విమర్శించారు. దేవుడి దయవల్ల నేడు జిందాల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ఆవుతోందని, మూడు దశల్లో పరిశ్రమ నిర్మాణం జరుగుతుందన్నారు. ప్లాంట్ సపోర్ట్ కోసం చాలా కష్ట పడ్డామని.. మంచి రోజులు వచ్చాయన్నారు. స్టీల్ సిటీ కావాలనే అభివృద్ధి పనులు చేస్తున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కాగా పనులు చేయకుండా మళ్లీ భూమిపూజ చేయడంపై విపక్షాలు మండిపడుతున్నాయి.

అధికారం చేపట్టిన కొత్తలో స్టీలు ప్లాంటు నిర్మాణానికి సీఎం జగన్‌ భూమిపూజ చేశారు. మూడేళ్లలో పూర్తిచేసి 25వేల మందికి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. మూడేళ్లు దాటింది. ఇక ఏడాదికి పదవీకాలం పూర్తికానుంది. అధికారం దిగిపోవడానికి ముందు మరోసారి ఇదే స్టీలు ప్లాంటు నిర్మాణానికి బుధవారం భూమిపూజ చేశారు. ఒకే ఫ్యాక్టరీ నిర్మాణానికి రెండుసార్లు భూమి చేసిన ముఖ్యమంత్రిగా సీఎం జగన్‌ చరిత్ర సృష్టించారు. ఇదొక్కటే కాదు... జిల్లాలో ఎడాపెడా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. శిలాఫలకాలు ఆవిష్కరించారు. వీటిలో చాలా వరకు ఇంకా పునాదుల దశ దాటలేదు.

Updated Date - 2023-02-15T15:15:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising