Hyderabad: రేపు ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులర్పించనున్న లోకేష్
ABN, First Publish Date - 2023-01-24T14:16:25+05:30
అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) పాదయాత్ర (Padayatra) ఈ నెల 27వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.
అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) పాదయాత్ర (Padayatra) ఈ నెల 27వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆయన బుధవారం హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ (NTR Ghat)లో నివాళులర్పించనున్నారు. మధ్యాన్నం 1.20 గంటలకు జూబ్లీహిల్స్‌లోని లోకేష్ తన నివాసం నుంచి ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్లనున్నారు. ఈ సందర్బంగా తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ (Kasani Gnaneshwar) ఆధర్యంలో చంద్రబాబు (Chandrababu) ఇంటి నుంచి ఎన్టీఆర్ ఘాట్ వరకు బైక్ ర్యాలీ (Bike Rally) నిర్వహించనున్నారు. తర్వాత 2.15 గంటలకు ఘాట్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుని కడపకు వెళ్లనున్నారు. అమీన్‌పీర్ దర్గా, మరియాపురం చర్చిలలో లోకేష్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. అనంతరం అక్కడి నుంచి 6.30 గంటలకు బయల్దేరి రోడ్డుమార్గాన తిరుమలకు వెళతారు. కుటుంబ సభ్యులతో కలిసి 26వ తేదీ ఉదయం శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు. 27వ తేదీన కుప్పంలోని వరదరాజుస్వామి ఆలయంలో పూజలు నిర్వహించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు కుప్పం నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు. లోకేష్ పర్యటనను విజయవంతం చేసేందుకు టీడీపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
Updated Date - 2023-01-24T14:16:28+05:30 IST