ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kotamreddy: ఈద్గా, ముఖ ద్వారాలు పూర్తయ్యాయని సంతోషించా.. కానీ అది ఎక్కువ కాలం నిలవలేదు

ABN, First Publish Date - 2023-04-12T14:51:58+05:30

బారాషహిద్ దర్గా అభివృద్ధి పనులు జరగాలని ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పండుగగా రొట్టెల పండుగని గుర్తించారన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

నెల్లూరు : బారాషహిద్ దర్గా అభివృద్ధి పనులు జరగాలని ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పండుగగా రొట్టెల పండుగని గుర్తించారన్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, నారాయణ, అబ్దుల్ అజీజ్, ఆనం వివేకానందరెడ్డిలు దర్గా అభివృద్ధికి కృషి చేశారు. దర్గా అభివృద్ధి కోసం రూ.15 కోట్ల నిధులని విడుదల చేస్తూ, సీఎం జీవో జారీ చేశారన్నారు. ఈద్గా, ముఖ ద్వారాలు తన హయాంలో పూర్తి అయ్యాయని కోటంరెడ్డి పేర్కొన్నారు. అయితే తన సంతోషం ఎక్కువ కాలం నిలవలేదన్నారు. సీఎం విడుదల చేసిన జీవోకి ఆర్ధిక శాఖ ఆమోదం ఇవ్వలేదన్నారు. సీఎం జీవో కాపీ చిత్తు కాగితంగా పరిగణలోకి తీసుకున్నారన్నారు. నిధులు మంజూరు చేయాలని రంజాన్ మాసంలో లక్ష మందితో విజ్ఞాపన కార్యక్రమం చేపట్టామన్నారు. సీఎం కార్యాలయానికి వాట్సాప్, పోస్ట్ కార్డులు, టెక్స్ట్ మెస్సేజీల ద్వారా నిరసన తెలుపుతామన్నారు. ‘సీఎం జగన్ ని రెండు చేతులతో వేడుకుంటున్నాను. ఆర్ధిక శాఖ అనుమతులు ఇవ్వాలని కోరుకుంటున్నా. దర్గా అభివృద్ధిలో ఎటువంటి రాజకీయ అంశం లేదు’ అని కోటంరెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2023-04-12T14:51:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising