ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Anganwadis: వచ్చే ఎన్నికల్లో ఓటుతో వైసీపీకి గుణపాఠం చెబుతాం..

ABN, Publish Date - Dec 19 , 2023 | 02:01 PM

కృష్ణాజిల్లా: తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీలు చేపట్టిన ఆందోళన మంగళవారం నాటికి 8వ రోజుకు చేరింది. ఇవాళ కృష్ణా జిల్లా, మచిలీపట్నంలో అంగన్‌వాడీలు వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం చేపట్టారు.

కృష్ణాజిల్లా: తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీలు చేపట్టిన ఆందోళన మంగళవారం నాటికి 8వ రోజుకు చేరింది. ఇవాళ కృష్ణా జిల్లా, మచిలీపట్నంలో అంగన్‌వాడీలు వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కలెక్టరేట్ వద్ద వైసీపీ జెండా రంగు పొలిన కండువా వేసి సీఎం జగన్ పాడెను ఏర్పాటు చేశారు. తమకు న్యాయం చేయాలంటూ పాడె ముందు అంగన్‌వాడీలు శోకాలు పెట్టి నిరసన తెలిపారు. మరికొంత మంది చెవుల్లో పువ్వులు, క్యాబెజీలను పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా అంగన్‌వాడీ మహిళలు మాట్లాడుతూ ఎనిమిది రోజులుగా తాము ఆందోళన చేస్తున్నా... ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. క్రిస్మస్ పండుగను కార్మికులు ఆనందంగా జరుపుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. తమకు కనీస వేతనం, గ్రాడ్యూటి ఇవ్వాలని కోరుతున్నామని, ప్రభుత్వం స్పందించకుంటే రానున్న ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెబుతామని అంగన్‌వాడీ మహిళలు స్పష్టం చేశారు.

గుంటూరు జిల్లాలో.. అంగన్‌వాడీల సమ్మె 8వ రోజు కొనసాగుతోంది. వంటా వార్పు కార్యాక్రమాలతో నిరసన తెలుపుతున్నారు. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ప్రకాశం జిల్లాలో 8వ రోజు అంగన్‌వాడీ సిబ్బంది సమ్మె కొనసాగుతోంది. ఒంగోలు కలెక్టరేట్ ఎదుట వంటా వార్పు కార్యమం చేపట్టి నిరసన తెలుపుతున్నారు. అంగన్‌వాడీ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.

Updated Date - Dec 19 , 2023 | 02:01 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising