ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Jagan Govt: కేఆర్ నారాయణపై కొనసాగుతున్న కక్షసాధింపు... మరోసారి జగన్ సర్కార్ నోటీసులు

ABN, First Publish Date - 2023-04-19T13:12:58+05:30

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణపై జగన్ సర్కార్ కక్షసాధింపు కొనసాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణపై (AP Government Employees Union President KR Suryanarayana) జగన్ సర్కార్ (Jagan government) కక్షసాధింపు కొనసాగుతోంది. గతంలో సకాలంలో జీతాలు ఇవ్వకపోవడం, పెండింగ్ బకాయిలు చెల్లించకపోవడంపై రాష్ట్ర గవర్నర్‌ను కేఆర్ సూర్యనారాయణ కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన నేతృత్వంలోని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదు అంటూ అప్పట్లో వైసీపీ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై కేఆర్ సూర్యనారాయణ హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఆయన నేతృత్వంలో పనిచేస్తున్న వాణిజ్య పన్నులశాఖ గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదు అంటూ తాఖీదులిచ్చింది. వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సంఘానికి కూడా కేఆర్ సూర్యనారాయణ అధ్యక్షునిగా ఉన్నారు. ఈ క్రమంలో వాణిజ్య పన్నుల శాఖ బదిలీలలో జరిగిన అక్రమాలను ప్రశ్నించడం, నిరసన తెలియజేయడాన్ని సాకుగా చూపుతూ తాజగా నోటీసులు జారీ అయ్యాయి. ప్రభుత్వ నోటీసులపై కేఆర్ సూర్యనారాయణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-04-19T13:14:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising