ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వివేకా హత్య కేసులో డ్రామా నడుస్తోంది: కేఏ పాల్‌

ABN, First Publish Date - 2023-04-28T02:46:52+05:30

వివేకా హత్య కేసు విచారణలో డ్రామా నడుస్తోందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ వ్యాఖ్యానించారు. విజయవాడలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ, ఏప్రిల్‌ 27(ఆంధ్రజ్యోతి): వివేకా హత్య కేసు విచారణలో డ్రామా నడుస్తోందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ వ్యాఖ్యానించారు. విజయవాడలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కేసు విషయంలో తాను ఇప్పటికే సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌ను కలిసి బాధితులకు న్యాయం చేయాలని, కేసును లోతుగా విచారణ చేయాలని కోరానని చెప్పారు. వివేకానుని ఎవరు, ఎందుకు చంపారో ప్రజలకు తెలియాలన్నారు. ఇది కుటుంబ హత్యా, రాజకీయ హత్యా అన్న విషయాన్ని సీబీఐ నిష్పక్షపాతంగా విచారించాలని కోరారు. నేరం చేసిన వారు ఎంతటి వారైనా శిక్ష అనుభవించాల్సిందేనన్నారు. కాగా, వచ్చే ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్‌ తనతో వస్తే కలిసి పోటీ చేస్తామన్నారు. 2014 తర్వాత బయటకు వచ్చిన పవన్‌ 2019లో మళ్లీ బీజేపీతో ఎందుకు కలిశారని ప్రశ్నించారు. పవన్‌ తన పార్టీని ప్రజాశాంతి పార్టీలో విలీనం చేయాలని కోరారు. గంగవరం పోర్టును ఆదానికి అన్యాయంగా అమ్మేశారని ఆరోపించారు. రూ.3లక్షల కోట్ల విలువచేసే ఆస్తిని రూ.3వేల కోట్లకు అమ్మేశారని విమర్శించారు. కాగా, తెలంగాణ సచివాలయాన్ని అంబేడ్కర్‌ జయంతి రోజు ప్రారంభించాలని తాను కోరితే, హిట్లర్‌ చనిపోయిన రోజున కేసీఆర్‌ ప్రారంభిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్‌పై న్యాయపోరాటం కొనసాగుతోందన్నారు.

Updated Date - 2023-04-28T02:46:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising