Avinash Reddy: రెండో రోజు సీబీఐ విచారణకు హాజరైన అవినాష్‌రెడ్డి.. ఈరోజు ఏం అడుగనున్నారో?..
ABN, First Publish Date - 2023-04-20T09:51:36+05:30
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణను ఎదుర్కొంటున్నారు.
హైదరాబాద్: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jagan) సొంత బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో (YS Viveka Case) కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (Kadapa YCP MP YS Avinash Reddy) సీబీఐ విచారణను ఎదుర్కొంటున్నారు. వరుసగా రెండో రోజు సీబీఐ అధికారుల ముందు ఎంపీ హాజరయ్యారు. గురువారం ఉదయం తన నివాసం నుంచి సీబీఐ కార్యాలయానికి చేరుకున్న అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారించనున్నారు. అవినాష్ రెడ్డి న్యాయవాదులు కూడా సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. హైకోర్టు ఆదేశాలతో అవినాష్ రెడ్డి రెండో రోజు సీబీఐ అధికారులు విచారించనున్నారు. 25 వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దు అని హైకోర్ట్ మధ్యంతర ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
కాగా... నిన్న(బుధావారం) సుదీర్ఘంగా ఎనిమిది గంటల పాటు అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారించారు. వైఎస్ వివేకా హత్య జరిగిన రోజు జరిగిన పరిణామాలపై ఆరా తీశారు. అవినాష్ రెడ్డి రాజకీయ ఎంట్రీపై కూపి లాగారు. నిందితులతో జరిపిన ఆర్థిక లావాదేవీలపై ఎంపీని సీబీఐ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. 40 కోట్ల డీల్‌కు సంబంధించి అవినాష్ రెడ్డి పాత్రపై ఆరా తీశారు. సహజ మరణంగా ఎందుకు చిత్రికరించారని ప్రశ్నించింది. మరోవైపు సీబీఐ కొత్త ఆఫీసర్ వికాస్ సింగ్‌కు అవినాష్ రెడ్డి లేఖ రాశారు. వైఎస్ వివేక హత్య జరిగిన రోజు దొరికిన లేఖపై దర్యాప్తు జరపాలని కోరారు. వివేకా ఫోన్‌లో ఉన్న వివరాలు బయట పెట్టాలన్నారు. వివేకా అల్లుడు రాజశేఖర్‌ను ఎందుకు విచారించడం లేదని అవినాష్ ప్రశ్నించారు.
Updated Date - 2023-04-20T10:03:28+05:30 IST