ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: అర్థరాత్రి గ్రామంలోకి ప్రవేశించిన ఆ ఎనిమిది మంది చేసిన పనేంటంటే...

ABN, First Publish Date - 2023-02-13T09:24:45+05:30

ఆధునిక టెక్నాలజీతో ప్రపంచం దూసుకుపోతున్నప్పటికీ కొన్ని చోట్ల, కొందరు మనుషులు ఇంకా వెనకటి జీవితంలోనే గడుపుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్టీఆర్: ఆధునిక టెక్నాలజీతో ప్రపంచం దూసుకుపోతున్నప్పటికీ కొన్ని చోట్ల, కొందరు మనుషులు ఇంకా వెనకటి జీవితంలోనే గడుపుతున్నారు. క్షుద్రపూజలు, లంకెబిందెలు, నర బలుల పేరుతో శక్తులు వస్తాయనే మూర్ఖపు ఆలోచనతో అనేక పిచ్చి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా జిల్లాలోని తిరువూరు రురల్ మండల పరిధి చౌటపల్లి గ్రామంలో అర్థరాత్రి క్షుద్ర పూజలల కలకలం రేగింది. గ్రామంలో కొందరు వ్యక్తులు ప్రవేశించి క్షద్రపూజలు చేస్తున్నారనే భయంతో గ్రామస్థులు ఆందోళన చెందారు. అసలేం జరిగిందంటే.... తిరువూరు మండలం టేకులపల్లి - చౌటపల్లి గ్రామాల సరిహద్దుల్లో లంకెబిందెలు ఉన్నాయని కొందరు వ్యక్తులు కారులో వచ్చి గ్రామంలో అటు ఇటు తిరిగారు. గుప్తనిధుల కోసం వచ్చిన వారి వెంట ఒక చిన్న బాలుడు ఉండటంతో అనుమానంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందజేశారు. దాదాపు ఎనిమిది మంది సభ్యులు గుప్తనిధుల కొరకు గ్రామానికి వచ్చారు. వచ్చిన వారిలో సత్తుపల్లి, బుగ్గపాడు, తిరువూరు, ఏరుకోపాడు, టేకులపల్లి వాసులు ఉన్నారు. మొత్తం 8 మంది గుప్తనిధుల ముఠాలో నలుగురు పరారవగా.. మరో నలుగురిని గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Updated Date - 2023-02-13T09:33:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising