కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Amaravati: వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం చంద్రబాబు కసరత్తు..

ABN, First Publish Date - 2023-06-28T16:57:12+05:30

అమరావతి: రాబోయే ఎన్నికల్లో గెలుపు కోసం టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కసరత్తు మొదలుపెట్టారు. అన్ని నియోజకవర్గాలకు ఇన్చార్జులను నియమించేందుకు ప్లాన్ చేస్తున్నారు. నేతల గ్రాఫ్‌పై సమీక్షలు నిర్వహిస్తున్నారు.

Amaravati: వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం చంద్రబాబు కసరత్తు..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాబోయే ఎన్నికల్లో గెలుపు కోసం టీడీపీ (TDP) జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు (Chandrababu) కసరత్తు మొదలుపెట్టారు. అన్ని నియోజకవర్గాలకు ఇన్చార్జులను (Incharges) నియమించేందుకు ప్లాన్ చేస్తున్నారు. నేతల గ్రాఫ్‌ (Graph)పై సమీక్షలు (Reviews) నిర్వహిస్తున్నారు. కొన్ని స్థానాల్లో నెలకొన్న ప్రతిష్టంభనకు ముగింపు పలకాలని చంద్రబాబు నిర్ణయించారు.

ఓ వైపు అసెంబ్లీ ఇంచార్జులతో రెండో దఫా రివ్యూలు... మరోవైపు ఆయా స్థానాల్లో ఇంచార్జుల నియామకాన్ని చంద్రబాబు వేగవంతం చేశారు. ఇప్పటికే 43 అసెంబ్లీ ఇంచార్జులతో రెండో దఫా సమీక్షలు ముగిసాయి. ఇంచార్జుల నియామకంపై కొన్ని స్ధానాల్లో నెలకొన్న ప్రతిష్టంభనకు ముగింపు పలుకుతూ నిర్ణయాలు తీసుకున్నారు. సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి కన్నా లక్ష్మీ నారాయణను ఇంచార్జిగా నియమిస్తూ కొద్ది రోజుల క్రితం నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జీడీ నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జిగా వీఎం థామస్, పూతలపట్టుకు కలికిరి మురళీ మోహన్‌ను నియమించారు.

వర్గ పోరు ఉన్న స్థానాలపై చంద్రబాబు ఫోకస్ పెట్టారు. గోపాలపురం నియోజవకర్గంలో పార్టీ నేతల మధ్య విభేదాలకు ముగింపు పలకనున్నారు. గోపాలపురం ఇంచార్జ్ వెంకటరాజు, పార్టీ నేత బాపిరాజులను వచ్చి కలవమని పిలుపిచ్చారు. మరోవైపు పార్టీలో చేరికలపైనా దృష్టి పెట్టారు. కాగా గురువారం శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్‌సివి నాయుడు టీడీపీలో చేరనున్నారు. భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమంపై ప్రజల్లోకి వెళ్లేందుకు చంద్రబాబు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వచ్చే నెల మొదటి లేదా రెండో వారం నుంచి భవిష్యత్‌కు గ్యారెంటీపై జిల్లాల్లో చంద్రబాబు పర్యటనలకు సిద్ధమవుతున్నారు. యువగళం పాదయాత్ర ఒకవైపు.... మరోవైపు భవిష్యత్‌కు గ్యారెంటీపై చంద్రబాబు ప్రచార యాత్రలు ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

Updated Date - 2023-06-28T16:57:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising