AP News: ముదిరిన మంత్రి-ఎమ్మెల్యే అనుచరుల ఫ్లెక్సీల రగడ
ABN, First Publish Date - 2023-06-23T17:49:26+05:30
ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్‌లో రగిలిన ఫ్లెక్సీల వ్యవహారం ముదురుతోంది. రెండు రోజుల క్రితం మంత్రి జోగి రమేష్ అనుచరుడి పుట్టినరోజు సందర్భంగా ఇబ్రహీంపట్నం రింగ్ చుట్టూ జోగి వర్గీయులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రాత్రికి రాత్రే అగంతకులు ఫ్లెక్సీలు చించి వేయడంతో ఫ్లెక్సీల రగడ మరింత
ఎన్టీఆర్ జిల్లా: ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్‌లో రగిలిన ఫ్లెక్సీల వ్యవహారం ముదురుతోంది. రెండు రోజుల క్రితం మంత్రి జోగి రమేష్ (Jogi Ramesh) అనుచరుడి పుట్టినరోజు సందర్భంగా ఇబ్రహీంపట్నం రింగ్ చుట్టూ జోగి వర్గీయులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రాత్రికి రాత్రే అగంతకులు ఫ్లెక్సీలు చించి వేయడంతో ఫ్లెక్సీల రగడ మరింత ముదిరింది. వసంత కృష్ణ ప్రసాద్ (MLA Vasantha Krishna Prasad ) అనుచరులే ఈ పని చేసి ఉంటారని జోగి వర్గీయులు అనుమానిస్తూ మండిపడ్డారు.
ఈ ఫ్లెక్సీల రగడ ముదరడంతో కొండపల్లి మున్సిపల్ అధికారులు రంగంలోకి దిగారు. ఇబ్రహీంపట్నం రింగ్ చుట్టూ ఉన్న ఫ్లెక్సీలను అధికారులు తొలగించారు. మంత్రి జోగి రమేష్ బంధువుల భవనంపై ఉన్న ఫ్లెక్సీని 24 గంటల్లో తొలగించాలని కొండపల్లి మున్సిపల్ కమిషనర్ నోటీసులు జారీ చేశారు. నిబంధనల ప్రకారమే బిల్డింగ్‌పైన ఉన్న హోర్డింగ్‌లను తొలగించాలని భవన యజమానులకు నోటీసులు జారీ చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు తెలిపారు.
Updated Date - 2023-06-23T17:49:26+05:30 IST