AP News: ఏపీ మండలి సమావేశాలు ప్రారంభం..
ABN, First Publish Date - 2023-09-21T10:54:03+05:30
అమరావతి: ఏపీ శాసనమండలి సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుపై టీడీపీ నేతలు వాయిదా తీర్మానం ఇచ్చారు. అలాగే పిడిఎఫ్ నేతలు సీపీఎస్ రద్దుపై వాయిదా తీర్మానం ఇచ్చారు.
అమరావతి: ఏపీ శాసనమండలి సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుపై టీడీపీ నేతలు వాయిదా తీర్మానం ఇచ్చారు. అలాగే పిడిఎఫ్ నేతలు సీపీఎస్ రద్దుపై వాయిదా తీర్మానం ఇచ్చారు. అయితే ఈ వాయిదా తీర్మానాలను మండలి ఛైర్మన్ తిరస్కరించారు. చంద్రబాబు అరెస్టుపై చర్చించాలంటూ టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. ప్లకార్డులతో ఛైర్మన్ పోడియం వద్ద నిరసన తెలిపారు. న్యాయం కావాలంటూ నినాదాలు చేశారు.
మరోవైపు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకాగానే సభ హాట్ హాట్‌గా నడిచింది. తమ పార్టీ నుంచి టీడీపీలోకి వెళ్లి అవాంఛనీయంగా వ్యవహరిస్తున్నారని ఏపీ అసెంబ్లీలో మంత్రి అంబటి రాంబాబు అన్నారు. మిగిలిన సభ్యులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కాబట్టి వారిపై వెంటనే చర్చలు తీసుకోవాలన్నారు. లేకపోతే తమ సభ్యులు కూడా అవాంఛనీయ కార్యక్రమాలకు పాల్పడే ప్రమాదం ఉందన్నారు. అంబటి వ్యాఖ్యలతో ఏపీ అసెంబ్లీ రసాభాసగా మారింది. దీంతో అసెంబ్లీలో స్పీకర్ మైక్‌లు కట్ చేసి.. సభకు విరామం ప్రకటించారు.
ఇంకోవైపు ఏపీ అసెంబ్లీలో టీడీఎల్పీలో టీడీపీ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై చర్చించారు. ఎమ్మెల్యే బాలకృష్ణను మంత్రి అంబటి రాంబాబు రెచ్చగొట్టిన వైనంపై ఎమ్మెల్యేలు మాట్లాడుకున్నారు.
Updated Date - 2023-09-21T10:54:03+05:30 IST