ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Narayana: ఎన్నికల ప్రక్రియ అధికార పార్టీకి అనుకూలంగా జరుగుతోంది

ABN, First Publish Date - 2023-10-10T13:00:33+05:30

అమరావతి: ఐఏఎస్ - ఐపీఎస్‌లను కాదని అనుకూల బృందాలను ఎన్నికల్లో దింపడం బ్యూరోకాట్స్‌ను అవమానించడమేనని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్లు చెప్పారు.

అమరావతి: ఐఏఎస్ (IAS) - ఐపీఎస్‌ (IPS)లను కాదని అనుకూల బృందాలను ఎన్నికల్లో దింపడం బ్యూరోకాట్స్‌ను (Bureaucrats) అవమానించడమేనని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (Narayana) అన్నారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ (Letter) రాసినట్లు చెప్పారు. ప్రజలకు ఏదైనా ప్రభుత్వం ఇవ్వాలనుకుంటే ఆరు నెలల ముందు ఇచ్చి అమలు చేయాలని, ఎన్నికలకు ముందు వాగ్దానాలు ఇచ్చి డబ్బులు పంచుతోందని, ఎన్నికల ప్రక్రియ అధికార పార్టీకి అనుకూలంగా జరుగుతోందని ఆయన తీవ్రస్థాయిలో ఆరోపించారు.

ఇప్పుడున్న కేంద్ర ఈసీఐ (ECI) అధికారి ఎక్కడో ఉంటే ఫస్ట్ ప్లేస్‌కు వచ్చారని, ప్రైవేట్ సైన్యంను పెట్టుకుని అధికార దూర్వినియోగానికి పాలడుతున్నారని నారాయణ విమర్శించారు. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో సీపీఐ, సీపీఎంలు (CPI, CPM) కలిసి బలమైన స్థానాల్లో పోటీ చేస్తున్నాయని చెప్పారు. ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్‌తో కాకుండా వామపక్షాలు విడిగా పోటీ చేస్తున్నాయన్నారు. సీపీఐ, సీపీఎం నుంచి చెరో 5 సీట్లు చొప్పున కాంగ్రెస్‌కు ప్రతిపాదన పెట్టామని, అయితే కాంగ్రెస్‌తో రాజకీయ అవగాహన కుదిరిందని.. సీట్ల అవగాహన కుదరలేదని చెప్పారు. సీట్ల అంశంపై ఇంకా క్లారిటీ రాలేదన్నారు. చట్ట సభల్లో తమ వాయిస్ ఉండాలని కోరుకుంటున్నామని, కాంగ్రెస్ ప్రకటించే అభ్యర్థుల లిస్టులో తమ సీట్ల కేటాయింపు కూడా ఉంటోందనుకుంటున్నామని నారాయణ అభిప్రాయం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-10-10T13:00:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising