ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ramakrishna: ఏపీలో ప్రచారం చేసేందుకు బీజేపీకి సిగ్గుండాలి

ABN, First Publish Date - 2023-06-12T14:05:54+05:30

ఏపీలో ప్రచారం చేసేందుకు బీజేపీకి సిగ్గుండాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. దేశ అప్పులను రూ.155 లక్షల కోట్లకు చేర్చినందుకు మోడీ గ్లోబల్ లీడర్ అయ్యారా? అని ప్రశ్నించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీలో ప్రచారం చేసేందుకు బీజేపీకి సిగ్గుండాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ (CPI Leader Ramakrishna) వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. దేశ అప్పులను రూ.155 లక్షల కోట్లకు చేర్చినందుకు మోడీ గ్లోబల్ లీడర్ అయ్యారా? అని ప్రశ్నించారు. 67 ఏళ్లలో ప్రభుత్వాలు చేసిన రూ.55 లక్షల కోట్ల అప్పులకన్నా, 9 ఏళ్ల మోడీ పాలనలో చేసిన అప్పు రెండింతలన్నారు. నిరుద్యోగాన్ని పెంచినందుకా?.. 27 మంది గుజరాత్ వాళ్ళు బ్యాంకులకు అప్పులు ఎగ్గొట్టి పారిపోయినందుకా?.. అదానీ, అంబానీలకు వూడిగం చేస్తున్నందుకా?.. ఎందుకు నరేంద్ర మోడీ గ్లోబల్ లీడర్ అయ్యారని నిలదీశారు. ఏపీకి రాజధాని లేదని అమిత్ షా (Amit Shah) చెబుతున్నారన్నారు. రాష్ట్రంలో అవినీతి పరిపాలన జరుగుతుంటే కేంద్రంలో హోంమంత్రి స్థానంలో ఉండి గత 4 ఏళ్లుగా ఎందుకు చర్యలు తీసుకోలేదని అడిగారు. అవినాష్ రెడ్డిని అరెస్టు చేయలేని దద్దమ్మగా సీబీఐ వ్యవహరించడం వెనుక అమిత్ షా పాత్ర లేదా అని ప్రశ్నించారు. సీబీఐ అమిత్ షా కనుసన్నల్లో నడుస్తోందని ఆయన ఆరోపించారు.

రైతుకు రోజుకు రూ.20 ఇచ్చి బ్రహ్మాండమైన సహాయం చేస్తున్నట్లు చెప్పడానికి బీజేపీకి సిగ్గుండాలన్నారు. రూ.16 లక్షల కోట్లకు అదానీ సంపదను మోడీ సర్కార్ (Modi Government) పెంచిందన్నారు. భారతదేశంలో ఇంత దరిద్రపు పాలన అందించిన ఘనత నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని బీజేపీదే అన్నారు. కార్పోరేట్లతో బీజేపీ (BJP) కుమ్మక్కై దేశ సంపదను దోచి పెడుతున్నారని మండిపడ్డారు. కేంద్రానికి తెలియకుండానే వైసీపీ ప్రభుత్వం అదానీకి భూములు, పోర్టులు కట్టబెట్టిందా? అని అన్నారు. వివేకా హత్య గురించి 3 ఏళ్లుగా సీబీఐ విచారణ సిగ్గుచేటని విమర్శించారు. బీజేపీ, వైసీపీ కుమ్మక్కవ్వడం వల్లే అవినాష్ రెడ్డి అరెస్టు జరగలేదన్నారు. మతం తప్ప వేరే ఎజెండా లేని పార్టీ బీజేపీ అని వ్యాఖ్యలు చేశారు. రియల్ ఎస్టేట్ కోసం విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నారని పేర్ని నాని చెప్పారన్నారు. ఏపీ నుంచి 30 మంది వైసీపీ ఎంపీలు ఉన్నారుగా... అందరూ కలిసి రావాలని.. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని.. కేంద్రం ఎందుకు దిగిరాదో చూద్దామని రామకృష్ణ పేర్కొన్నారు.

Updated Date - 2023-06-12T14:05:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising