ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ramakrishna: గవర్నర్‌కు ఉద్యోగులు సమస్యలను విన్నవించడం నేరమా?

ABN, First Publish Date - 2023-01-24T14:35:31+05:30

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుర్తింపు రద్దు చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం బ్లాక్ మెయిల్ చేయడం తగదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుర్తింపు రద్దు చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం బ్లాక్ మెయిల్ చేయడం తగదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ (CPI Leader K Ramakrishna) అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగుల గోడు ప్రభుత్వం, ముఖ్యమంత్రి, మంత్రులు కూడా పట్టించుకోకపోతే ఎవరికి మొరపెట్టాలని ప్రశ్నించారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు గవర్నర్‌కు విన్నవించటం నేరమా అని నిలదీశారు. ఉద్యోగ సంఘాల నేతలు రాజకీయ అంశాలేవి ప్రస్తావించలేదు కదా అని అన్నారు. ఉద్యోగసంఘం నేత కె ఆర్ సూర్యనారాయణపై రాష్ట్ర ప్రభుత్వ కక్ష సాధింపు ధోరణి సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు, నిరంకుశ విధానాలు ఇకనైనా విడనాడాలని హితవుపలికారు. ఉద్యోగుల న్యాయమైన కోర్కెల పరిష్కారం కోసం చిత్తశుద్ధి చూపాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.

Updated Date - 2023-01-24T14:35:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising