ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ramakrishna: సామాన్యులకు ఏమాత్రం ఉపయోగం లేని బడ్జెట్..

ABN, First Publish Date - 2023-02-05T14:56:55+05:30

విజయవాడ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్యులను మరింత ఇబ్బంది పెట్టేలా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Nirmala Sitharaman) ప్రవేశపెట్టిన బడ్జెట్ (Budget) సామాన్యులను మరింత ఇబ్బంది పెట్టేలా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (Ramakrishna) విమర్శించారు. ఆదివారం ఆయన ఇక్కడ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (ABN Andhrajyothy)తో మాట్లాడుతూ పెరిగిన ధరలతో సామాన్యులు ఇబ్బందులు పడుతుంటే, దానిపై చర్యలు శూన్యమని అన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ఇచ్చిన హామీలను విస్మరించారని, ఎరువులపై సబ్సిడీ ఎత్తివేశారని, గిట్టుబాటు ధరలు లేవని అన్నారు. నిరుద్యోగులకు (Unemployed) ఉద్యోగ కల్పనపై చర్యలు లేవని, కార్పొరేట్ వాళ్ళ ఆస్తులు పెంచేలా కేంద్ర బడ్జెట్ ఉందని విమర్శించారు. సామాన్యులకు ఏమాత్రం ఉపయోగం లేని బడ్జెట్ అని అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)కు తీరని అన్యాయం చేశారని, ఎన్నికలు వస్తున్నాయని కర్ణాటక (Karnataka) అప్పర్ భద్రకు నిధులు కేటాయించారని రామకృష్ణ విమర్శించారు. చట్టంలో ఉన్న రైల్వే జోన్ (Railway Zone), వెనుకబడిన ప్రాంతాలకు నిధులు లేవని, ఏపీకి పూర్తిగా అన్యాయం చేసారని ఆవేదన వ్యక్తం చేశారు. హిండెన్ బర్గ్ (Hindenburg) నివేదికపై ప్రపంచం అంతా మాట్లాడుతుంటే ఆర్ధిక మంత్రి మాత్రం అంతా బాగానే ఉంది అని చెబుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో విలువైన భూములు, ప్రాజెక్టులు, అన్ని ఆదానికే దోచిపెట్టారని, రూ. 8వేల కోట్ల స్కామ్‌కు సత్యం రామలింగరాజు (Satyam Ramalingaraju) జైలుకు వెళ్లారని... ఆదాని విషయంలో మాత్రం లక్షల కోట్లు స్కామ్ బయటపడినా..

చర్యలు లేవని విమర్శించారు.

ఆదానిపై క్రిమినల్ కేసు పెట్టి.. చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త నిరసనలో భాగంగా రాష్ట్రంలో కేంద్ర కార్యాలయాల వద్ద ఫిబ్రవరి 10న నిరసనలు చేపడతామని రామకృష్ణ స్పష్టం చేశారు. రాష్ట్రంలో పేదవారికి అన్ని చేస్తున్నామని చెప్పిన సీఎం జగన్ (CM Jagan).. వారికి ఒక గూడు కూడా కట్టివ్వలేకపోయారని ఎద్దేవా చేశారు. 1.80 వేల రూపాయలతో ఏ విధంగా ఇల్లు కట్టుకుంటారని ప్రశ్నించారు. ఇసుక, సిమెంట్ ధరలు పెరిగిపోయాయని అన్నారు. టిడ్కో (Tidco) ఇళ్లు పూర్తయి పాడైపోతున్నా.. లబ్ధిదారులకు ఇవ్వకుండా నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా కట్టిన వేలాది ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వాలని కోరుతూ 6వ తేదీన (సోమవారం) నిరసనలకు పిలుపునిస్తున్నామని రామకృష్ణ అన్నారు.

Updated Date - 2023-02-05T14:56:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising