ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ramakrishna: ప్రభుత్వమే సొంతంగా అవార్డులు ఇచ్చేందుకు సిద్ధమవటం సిగ్గుచేటు..

ABN, First Publish Date - 2023-04-24T14:45:27+05:30

అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) సర్పంచ్‌లకు క్షమాపణ చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ (Ramakrishna) డిమాండ్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) సర్పంచ్‌లకు క్షమాపణ చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ (Ramakrishna) డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఏపీలోని పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా అవార్డులు ఇచ్చేందుకు సిద్ధమవటం సిగ్గుచేటన్నారు. కేంద్ర ప్రభుత్వం పంచాయితీలకు ప్రధానం చేసే అవార్డులలో తెలంగాణకు 10 అవార్డులు దక్కగా, ఏపీకి మొండిచేయి దక్కిందన్నారు.

కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు ఇచ్చిన నిధులను కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లాగేసుకుని పంచాయతీలను నిర్వీర్యం చేసిందని రామకృష్ణ విమర్శించారు. త్రాగునీరు, రోడ్ల మరమ్మత్తులు, విద్యుత్ సౌకర్యం వంటి కనీస సౌకర్యాలకు కూడా పంచాయతీల్లో నిధులు లేవన్నారు. గత 6 నెలలుగా సర్పంచులు రోడ్డెక్కి నిరసనలు తెలిపినా ఈ ప్రభుత్వానికి బుద్ధి రాలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు నిధులు సమకూర్చాలని డిమాండ్ చేశారు. జగన్ సర్కార్ తీసుకున్న కేంద్ర నిధులను తక్షణమే పంచాయతీలకు అప్పగించాలని, సర్పంచులకు అధికారాలు ఇవ్వాలని రామకృష్ణ ప్రభుత్వానికి సూచించారు.

Updated Date - 2023-04-24T14:45:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising