AP NEWS: డా. రాధా హత్య కేసులో ఊహించని మలుపు.. భర్తే హంతకుడు!
ABN, First Publish Date - 2023-08-11T19:47:20+05:30
ప్రముఖ వైద్యురాలు డా. మాచర్ల రాధా హత్య కేసు(Famous doctor Dr. Macherla Radha murder case)ను పోలీసులు ఛేదించారు.ఈ కేసులో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.
కృష్ణాజిల్లా(మచిలీపట్నం): ప్రముఖ వైద్యురాలు డా. మాచర్ల రాధా హత్య కేసు(Famous doctor Dr. Macherla Radha murder case)ను పోలీసులు ఛేదించారు.ఈ కేసులో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఒకరు భర్త డా. లోకనాధం మహేశ్వరరావు, మరొకరు డ్రైవర్ జాస్తి జనార్ధన్ (అలియాస్ మధు) కేసు పూర్వాపరాలను ఎస్పీ పి జాషువా మీడియాకు వివరించారు. గత నెల 25న తన నివాసంలో డా. మాచర్ల రాధా దారుణంగా హత్యకు గురయ్యారు. ఈ హత్య కేసును పోలీసులు సవాల్‌గా తీసుకున్నారు. భర్త కదలికలపై పోలీసులకు అనుమానం వచ్చి అదుపులోకి తీసుకోని విచారించారు. ఈ విచారణలో భర్తే హంతకుడిగా పోలీసులు నిర్ధారించారు. భార్యతో ఉన్న వ్యక్తిగత విషయాలు, ఆస్తి వివాదాలే భార్య హత్యకు దారి తీశాయని ఎస్పీ పి జాషువా(SP Joshuva) తెలిపారు. మూడు నెలల క్రితమే భార్యను హతమర్చేందుకు భర్త డా. మహేశ్వరరావు పక్కా ప్లాన్ రూపొందించారు. టెక్నికల్ ఇష్యూతో మూడు నెలల క్రితమే నిందితుడు సీసీ కెమెరాలను వినియోగంలో లేకుండా చేసినట్లు పోలీసులు తెలిపారు.
భార్యని హతమర్చేందుకు భర్త డా. మహేశ్వరరావు(Husband Dr. Maheswara Rao) డ్రైవర్‌కు రూ.30లక్షలు ఇచ్చినట్లు విచారణలో వెల్లడైందన్నారు.25వ తేదీన మధ్యాహ్నం డ్రైవర్‌తో కలిసి ఇనుప రాడ్డుతో భార్య తల మీద బలంగా కొట్టి హత్య చేశాడు. హత్య జరిగిన తర్వాత డ్రైవర్‌తో ఆ ప్రాంతంలో కారం చల్లించి నిందితుడు పోలీసు జాగిలాలను ఏమార్చాడు.రాత్రి 10.30గంటల వరకు ఆస్పత్రిలో ఓపీ చూసి ఏమీ తెలియనట్టు పోలీసు స్టేషన్‌లో తన భార్య హత్యకు గురైందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి నిందితులను సాక్ష్యాధారాలతో అరెస్ట్ చేశామని ఎస్పీ పి జాషువా మీడియాకు తెలిపారు.
Updated Date - 2023-08-11T20:00:39+05:30 IST