ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NIA Court : జగన్ కూడా విచారణకు హాజరు కావాల్సిందే..

ABN, First Publish Date - 2023-01-31T12:25:50+05:30

ఎట్టకేలకు కోడి కత్తి కేసు విచారణకు వచ్చింది. ఎన్ఐఏ కోర్టులో (NIA Court) కోడికత్తి కేసు విచారణ నేటి నుంచి విచారణ ప్రారంభమైంది. ఈ క్రమంలోనే కోడి కత్తి కేసు నిందితుడు శ్రీను విజయవాడ ఎన్ఐ కోర్టుకు చేరుకున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ : ఎట్టకేలకు కోడి కత్తి కేసు విచారణకు వచ్చింది. ఎన్ఐఏ కోర్టులో (NIA Court) కోడికత్తి కేసు విచారణ నేటి నుంచి ప్రారంభమైంది. ఈ క్రమంలోనే కోడి కత్తి కేసు నిందితుడు శ్రీను విజయవాడ ఎన్ఐ కోర్టుకు చేరుకున్నాడు. విశాఖ ఎయిర్‌పోర్టు అసిస్టెంట్ దినేష్ కుమార్ ప్రత్యక్ష సాక్షిగా నేడు హాజరు కావాలని కోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే ఆయన గైర్హాజరయ్యారు. తండ్రి మరణించడంతో కోర్టుకు హాజరు కాలేదని.. దినేష్ తరుపు న్యాయవాది తెలిపారు. దీంతో తదుపరి విచారణ ఫిబ్రవరి 15కు వాయిదా వేసింది. కాగా.. తదుపరి విచారణకు బాధితుడు సీఎం జగన్ సైతం విచారణకు హాజరు కావాలని ఎన్ఐఏ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

అసలేం జరిగిందంటే..

2019 ఎన్నికలకు ముందు అప్పటి ప్రతిపక్ష నేత జగన్‌పై కోడి కత్తితో దాడి జరిగింది. అది అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. నాలుగేళ్ల కిందట అంటే 2018లో జగన్ ఉత్తరాంధ్ర ప్రాంతంలో పాదయాత్ర చేస్తున్నారు. ఆయన హైదరాబాద్‌లోని కోర్టుకు హాజరవ్వాల్సి ఉండటంతో దానికి ముందురోజు మధ్యాహ్నమే విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఆయన వీఐపీ లాంజ్‌లో ఉండగా.. వెయిటర్ సెల్ఫీ తీసుకుంటానని వచ్చి కోడి కత్తితో దాడి చేశాడు. ఈ క్రమంలోనే జగన్ భుజానికి గాయమైంది. చిన్న గాయమే కావడంతో ఆయన హైదరాబాద్‌కు వచ్చి అక్కడ ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. కానీ తన గాయానికి 12 కుట్లు పడినట్టు చెప్పి 3 వారాల పాటు విశ్రాంతి తీసుకున్నారు. అప్పట్లో ఇది పెను సంచలనాన్ని సృష్టించింది.

ఈ దాడి కేసులో మొదటి ముద్దాయిగా జనిపల్లి శ్రీనివాసరావును పేర్కొన్నారు. ఎన్‌ఐఏ 2019లోనే చార్జిషీటు దాఖలుచేసింది. కానీ ఈ కేసు కోర్టు మెట్లెక్కేందుకు నాలుగేళ్లు పట్టింది. కోడికత్తితో తనపై దాడి చేయించారంటూ టీడీపీ ప్రభుత్వంపై జగన్‌తో పాటు వైసీపీ నేతలంతా పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. మరోవైపు టీడీపీ నేతలు ఎన్నికల్లో విజయం సాధించేందుకు కోడికత్తి గేమ్ ఆడారంటూ ఆరోపించారు. విమర్శలు, ప్రతి విమర్శల మధ్యే నాలుగేళ్ల కాలం గడిచింది. ట్విస్ట్ ఏంటంటే.. వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా ఈ కేసు మిస్టరీ మాత్రం ఇప్పటికీ వీడలేదు.

Updated Date - 2023-01-31T12:34:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising