Amaravati: సబ్ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నియామకాలపై హైకోర్టు కీలక ఉత్తర్వులు
ABN, First Publish Date - 2023-11-30T12:28:58+05:30
అమరావతి: ఏపీలోని సబ్‌ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నియామకాలపై హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. అభ్యర్థుల ఎత్తు కొలిచే విషయంలో అన్యాయం జరిగిందంటూ అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
అమరావతి: ఏపీలోని సబ్‌ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నియామకాలపై హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. అభ్యర్థుల ఎత్తు కొలిచే విషయంలో అన్యాయం జరిగిందంటూ అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. గతంలో రిజర్వ్ సబ్ ఇన్స్‌పెక్టర్‌గా పని చేసిన వ్యక్తిని కూడా ఎత్తు సరిపోలేదంటూ తిరస్కరించారని పిటీషనర్ తరపు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ ప్రమాణ పత్రం దాఖలు చేశారు. గతంలో అభ్యర్థులందరి ఎత్తు తన సమక్షంలోనే తీసుకుంటామంటూ హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా పిటీషనర్లందరూ సిద్ధంగా ఉన్నారని న్యాయవాది హైకోర్టుకు నివేదించారు.
2019లో ఎత్తు విషయంలో క్వాలిఫై అయిన అభ్యర్థులు 2023లో అనర్హత సాధించడంపై గతంలో హైకోర్టులో వాదనలు జరిగాయని, పూర్తి స్థాయి విచారణ తరువాత ఎస్ఐ ఫలితాలు నిలుపుదల చేయాలి అంటూ సింగిల్ జడ్జి ఉత్తర్వులు జడ శ్రవణ్ కుమార్ ఇచ్చిందన్నారు. ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ డివిజన్ బెంచ్‌కు రాష్ట్ర ప్రభుత్వం అప్పీలు చేసింది.
అయితే అభ్యర్థులు ఎత్తు విషయంలో తామే నిర్ణయం తీసుకుంటామంటూ ప్రతి అభ్యర్థిని హైకోర్టుకు రావాల్సిందిగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. దీనికి అనుగుణంగా అందరి అభ్యర్థుల తరపున న్యాయవాది జడ శ్రావన్ కుమార్ ప్రమాణ పత్రం పిటిషనర్ల తరపున దాఖలు చేశారు. దీంతో పిటిషనర్లు అందరూ సోమవారం కోర్టు ముందు హాజరు కావాల్సిందిగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.
Updated Date - 2023-11-30T12:29:00+05:30 IST