ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Farooq Shubli: జగన్ ఆడిన కోడి కత్తి డ్రామా ప్రజలకు అర్ధమైంది...

ABN, First Publish Date - 2023-04-18T16:49:44+05:30

కోడి కత్తి కేసు విచారణ నాటకీయ పరిణామాలతో సాగుతోందని, జగన్మోహన్ రెడ్డి ఆడిన కోడి కత్తి డ్రామా ప్రజలకు అర్ధమైందని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి కన్వీనర్‌ ఫారూక్ షుబ్లీ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: కోడి కత్తి కేసు (Kodikatti Case) విచారణ నాటకీయ పరిణామాలతో సాగుతోందని, జగన్మోహన్ రెడ్డి (Jaganmohanreddy) ఆడిన కోడి కత్తి డ్రామా ప్రజలకు అర్ధమైందని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి కన్వీనర్‌ ఫారూక్ షుబ్లీ (Farooq Shubli అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కోడి కత్తి శ్రీనివాస్ (Srinivas) తరపున అబ్దుల్ సలీం కేసు వాదిస్తున్నారని, డ్రైవర్‌ను‌ చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీకి బెయిల్ ఇచ్చారని... శ్రీనుకు మాత్రం బెయిల్ రాకుండా ప్రభుత్వ పెద్దలు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.

వివేకానంద రెడ్డి హత్య కేసు (YS Viveka Murder Case)లో అసలు వాస్తవాలు బయటకు వస్తున్నాయని, దస్తగిరి (Dastagiri) ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం నిందితులెవరో సమాజానికి తెలిసిందని ఫారూక్ షుబ్లీ అన్నారు. నిందితుడిగా ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డి సీఎం క్యాంపు ఆఫీస్ నుంచి ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. వారు చేసిన తప్పుల నుంచి బయట పడేందుకు చనిపోయిన వివేకానంద రెడ్డిపై నిందలు మోపుతారా?.. ముస్లిం మహిళతో పెళ్లి, మరొకరితో అక్రమ సంబంధం అని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి నాలుగేళ్ల క్రితం ఇవన్నీ ఎందుకు చెప్పలేక పోయారని ఆయన నిలదీశారు.

అవినాష్ రెడ్డి ఘటనా స్థలంలో మరకలు ఎందుకు‌ చెరిపివేశారో చెప్పాలని ఫారూక్ షుబ్లీ డిమాండ్ చేశారు. ఇంకా ఏ మొఖం పెట్టుకుని విశ్వసనీయత గురించి మాట్లాడతారన్నారు. అసలు విషయం పక్కదారి పట్టించేలా అవినాష్ రెడ్డి మాట్లాడుతున్నారని, సీబీఐ ఆధారాలతో స్పష్టం గా చెబుతున్నా... ఇంకా అబద్దాలు ప్రచారం చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదు కోట్ల మంది ప్రజలను మాయ చేసి అందలం ఎక్కారని, కోడి కత్తి కేసు, వివేకానంద రెడ్డి కేసులను అడ్డం పెట్టుకుని జగన్ సింపతితో గెలిచారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి వ్యవహారాలు అయితే బయటకి రాకూడదు.. బాబాయి వివేకా వ్యవహారాలు అయితే మహిళలతో సహా బయట పెడతారా?.. మీ కేసుల కోసం ముస్లిం మహిళను కించ పరిస్తే మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి తరపున పోరాటం చేస్తామని ఫారూక్ షుబ్లీ హెచ్చరించారు.

Updated Date - 2023-04-18T16:49:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising