ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

KodiKatti Case: ‘రావాలి జగన్.. చెప్పాలి సాక్ష్యం’.. లాయర్ సంచలన వ్యాఖ్యలు..

ABN, First Publish Date - 2023-04-17T17:05:29+05:30

విజయవాడ: కోడికత్తి కేసు (KodiKatti Case) విచారణ సోమవారం విజయవాడ ఎన్‌ఐఏ కోర్టు (NIA Court)లో జరిగింది. అనంతరం ఈ కేసు ఈనెల 20వ తేదీకి వాయిదా పడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: కోడికత్తి కేసు (KodiKatti Case) విచారణ సోమవారం విజయవాడ ఎన్‌ఐఏ కోర్టు (NIA Court)లో జరిగింది. అనంతరం ఈ కేసు ఈనెల 20వ తేదీకి వాయిదా పడింది. ఈ సందర్భంగా నిందితుడు శ్రీనివాసరావు తరఫు న్యాయవాది అబ్దుల్ సలీమ్ మీడియాతో మాట్లాడుతూ తన వాదన ఏంటంటే.. ‘రావాలి జగన్.. చెప్పాలి సాక్ష్యం’ అక్కడే ఈ కేసు ఆగిందన్నారు. దినేష్ కుమార్ వచ్చి ఆయన వాంగ్మూలం ఇచ్చి వెళ్లిపోయారని.. ఇప్పుడు సీఎం జగన్ రావాలని.. ఆయన కోర్టుకు రాకుండా పిటిషన్ వేసి.. కోర్టును గందరగోళం చేస్తున్నారని అన్నారు. పోలీసులు కూడా ‘లా’ను ఓవర్‌రైట్ చేశారని, నిందితుడిపై 307 సెక్షన్ పెట్టకూడదని, అలాగే ఈ కేసు ఎన్ఐఏకు ఇవ్వడం కూడా తప్పేనన్నారు.

జగన్ తరపు న్యాయవాది ఇనికొల్లు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ..

సీఎం జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసులో తదుపరి దర్యాప్తు కోసం వేసిన పిటీషన్‌పై వాదనాలు జరిగాయన్నారు. 1-1-2019 నాడు ఎన్ఐఎ ఈ కేసు దర్యాప్తు ప్రారంభించిందని దీనిలో భాగంగా సాక్షులను విచారించిందన్నారు. ఎన్ఐఎ జగన్‌ని విచారించిన సమయంలో చాలా విషయాలు ఎన్ఐఎ దృష్టికి తీసుకువచ్చారన్నారు. 23-01-2019న జగన్మోహన్ రెడ్డి తెలిపిన విషయాలపై ఎటువంటి విచారణ జరపకుండా ఛార్జీషీట్ దాఖలు చేశారని.. జగన్ వేసిన పిటీషన్‌పై కుట్రకోణం లేదంటూ ఎన్ఐఎ కౌంటర్ దాఖలు చేసిందన్నారు.

ఎన్ఐఎ సరిగా దర్యాప్తు చేయలేదని న్యాయస్దానం దృష్టికి తీసుకువెళ్లామని వెంకటేశ్వర్లు తెలిపారు. ముద్దాయి శ్రీనివాస్‌కు ఏఈపీ ఇచ్చే సమయంలో పూర్తి స్దాయి విచారణ చేసి ఇవ్వాలన్నారు. కానీ ఎటువంటి విచారణ చేయకుండా ఇచ్చారన్నారు. రెస్టారెంట్ ఓనర్ డీక్లరేషన్ ఇచ్చారని.. అధికారులు సరైన నిబంధనలు పాటించకుండా ఎయిర్ పోర్ట్ ఎంట్రీ పాస్ ఇచ్చారన్నారు. వాటిపై ఎన్ఐఎ దర్యాప్తు చేయలేదని.. దాడి జరిగిన సమయంలో నిందితుడు శ్రీనివాస్ దగ్గర ఏఈపీ పాస్ లేదన్నారు. తనకు ఏమైన జరిగితే తన అవయవాలు దానం చేయాలంటూ తల్లితండ్రులకు నిందితుడు శ్రీనివాస్ వ్రాసిన లేఖపై కూడా దర్యాప్తు చేయలేదని న్యాయవాది తెలిపారు.

Updated Date - 2023-04-17T17:05:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising