ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Raghurama: సీఎం దుకాణం సర్దేస్తున్నారనే ప్రచారాలు జరుగుతున్నాయి..

ABN, First Publish Date - 2023-02-07T15:28:26+05:30

ఢిల్లీ: జగనన్న (Jagananna) విశాఖ వాసంపై రాష్ట్రమంతా చర్చ నడుస్తోందని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnamraju) అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: జగనన్న (Jagananna) విశాఖ వాసంపై రాష్ట్రమంతా చర్చ నడుస్తోందని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnamraju) అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్‌లో చాలా మంది ఏపీ రాజధాని (AP Capital) మారుస్తున్నారని హేళనగా మాట్లాడుతున్నారన్నారు. సీఎం జగన్ (CM Jagan) దుకాణం సర్దేస్తున్నారనే వార్తలు చూస్తున్నామన్నారు. ఎవరైనా రాజధానిలో ఉంటామని అంటారు.... కానీ రాజధానిలో ఉండను అనే వారిని ఇప్పుడు చూస్తున్నామన్నారు. రాజు ఎక్కడ ఉంటే అదే రాజధాని కాదని, దీన్ని మానసిక రుగ్మత అంటారని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి జగన్ మాట్లాడిన రెండు

రోజులకే ఆయన తమ్ముడు ఎంపీ అవినాష్ రెడ్డి (Avinash Reddy)ని సీబీఐ అధికారులు (CBI Officers) విచారించారని రఘురామ అన్నారు. రేపో మాపో మరికొందరికి సీబీఐ నోటీసులిచ్చే అవకాశముందన్నారు. వివేకా హత్య కేసు (Viveka Murder Case)ను డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారా? లేక విశాఖపై ప్రేమతో జగన్ వైజాగ్ వస్తున్నారని చేస్తున్నారా? అన్నది అర్థం కావడం లేదన్నారు.

ఈ వార్తల నేపథ్యంలో అమరావతిలో అల్లకల్లోలంగా ఉందని, విశాఖ వాసుల్లో భయాందోళన నెలకొందని రఘురామ అన్నారు. సీఎం జగన్ విశాఖపట్నం వెళ్తే, గవర్నర్‌కు కూడా అక్కడే భవనం చూస్తారేమోనన్న అనుమానం వ్యక్తం చేశారు. రాజధాని అంశంలో కోర్టు తీర్పు రాబోతోందని, అంతవరకు ఆగాలని, రైతులను వంచించి వెళ్తే బాగోదన్నారు. కోర్టు తీర్పు వచ్చే వరకు ఎలాంటి మార్పు ఉండదన్నారు. జగన్‌‌కు అంతలా నచ్చితే విశాఖకు వీకెండ్‌కి వెళ్ళాలని సూచించారు. నరేంద్రమోదీ (PM Modi) వారణాసి నుంచి పరిపాలన చేస్తా అంటే బాగోదు కదా.. ప్రజలు హర్షించరని రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-02-07T15:28:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising