Narayana: ఆ మూడు పార్టీలు ఒక్కటే: సీపీఐ నారాయణ
ABN, First Publish Date - 2023-10-31T13:42:25+05:30
న్యూఢిల్లీ: బీజేపీ, బీఆర్ఎస్, వైఎస్సార్సీపీ.. ఈ మూడు పార్టీలు ఒక్కటేనని, అనేక విషయాల్లో మూడు పార్టీలు కుమ్మక్కయ్యాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.
న్యూఢిల్లీ: బీజేపీ (BJP), బీఆర్ఎస్ (BRS), వైఎస్సార్సీపీ (YSRCP).. ఈ మూడు పార్టీలు ఒక్కటేనని, అనేక విషయాల్లో మూడు పార్టీలు కుమ్మక్కయ్యాయని సీపీఐ (CPI) జాతీయ కార్యదర్శి నారాయణ (Narayana) ఆరోపించారు. ఈ సందర్బంగా మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఈ మూడు పార్టీలకు పూర్తిస్థాయి అవగాహన ఉందని, అనేక విషయాల్లో బీజేపీ, బీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీ కలిసే ఉన్నాయని, అన్ని విషయాల్లో మూడు పార్టీలకు అవగాహన ఉందని ఆరోపించారు. తెలుగుదేశం అధినేత (TDP Chief) చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (AP High Court) మధ్యంతర బెయిల్ (Interim Bail) ఇవ్వడం సంతోషమన్నారు. అనారోగ్య కారణాలతో నాలుగు వారాలు బెయిల్ ఇవ్వడం మంచిదేనన్నారు. కేసుల మీద కేసులు పెట్టి చంద్రబాబుపై కక్ష తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారని జగన్ ప్రభుత్వం (Jagan Govt.)పై మండిపడ్డారు. జైల్లో ఉండాల్సిన వాళ్లు బయట ఉన్నారని.. బయట ఉండాల్సిన వారు జైల్లో ఉన్నారని అన్నారు.
లిక్కర్ కేసులో (Liquor Case) జైల్లో ఉండాల్సిన వాళ్ళు బయట ఉన్నారని, బీజేపీ, బీఆర్ఎస్, వైఎస్సార్సీపీ లిక్కర్ కేసులో కుమ్మక్కయ్యాయని నారాయణ విమర్శించారు. గతంలో మనీష్ సిసోడియా (Manish Sisodia)ను అరెస్టు చేసి జైల్లో పెట్టారని.. ఇప్పుడు కేజ్రీవాల్ (Kejriwal)ను టార్గెట్ (Target)గా చేసి ముందుకు వెళుతున్నారని అన్నారు. చంద్రబాబు తీవ్రమైన నేరాలు చేయలేదని, ఇన్ని రోజులు జైల్లో పెట్టడం సరికాదన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసు (Skill Development Case)లో ముందు రూ. 300 కోట్లు అన్నారు.. ఇప్పుడు రూ. 17 కోట్లకు వచ్చిందన్నారు. వేల కోట్ల రూపాయల కుంభకోణాలకు పాల్పడి 13, 14 కేసులో ఉండి జైల్లో ఉండాల్సిన వాళ్ళు బయట ఉన్నారని, చంద్రబాబు, కేజ్రీవాల్‌పైన రాజకీయ కక్ష సాధింపుతోనే చర్యలు ఉంటున్నాయని నారాయణ వ్యాఖ్యానించారు.
తెలంగాణ ఎన్నికల్లో పొత్తులు సీట్ల సర్దుబాటుపై ఏఐసీసీ (AICC) నాయకత్వం తమతో మాట్లాడిందని, ఏఐసీసీ నేతల సమక్షంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఫోన్ చేశారని నారాయణ తెలిపారు. తాము అడిగిన బెల్లంపల్లికి బదులు చెన్నూరు ఇస్తామని చెప్పారని, అలాగే మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge) ఆఫీస్ నుంచి ఫోన్ చేసి అధికారికంగా కొత్తగూడెం చెన్నూర్ అని చెప్పారని.. అయితే తమకు ఇవ్వమని ఇప్పటి వరకు ఎక్కడ చెప్పలేదని నారాయణ పేర్కొన్నారు.
Updated Date - 2023-10-31T13:42:25+05:30 IST