Payyavula Keshav: పీఏసీలో ఖాళీలను భర్తీ చేయాలి...
ABN, First Publish Date - 2023-03-21T16:14:32+05:30
పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (Public Accounts Committee)లో ఖాళీలపై స్పీకర్ తమ్మినేని సీతారామ్ (Speaker Tammineni Sitaram)కు పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) లేఖ (Letter) రాశారు.
అమరావతి: పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (Public Accounts Committee)లో ఖాళీలపై స్పీకర్ తమ్మినేని సీతారామ్ (Speaker Tammineni Sitaram)కు పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) లేఖ (Letter) రాశారు. పీఏసీ (PAC)లో ఏడు ఖాళీలను భర్తీ చేయాలని లేఖ ద్వారా కోరారు. గతంలో ఇదే అంశానికి సంబంధించి గత ఏడాది అక్టోబర్ 21వ తేదీన అసెంబ్లీ సెక్రటరీకి లేఖ రాసిన విషయాన్ని ఈ సందర్భంగా పయ్యావుల కేశవ్ గుర్తు చేశారు. ఇప్పటివరకూ ఖాళీలు భర్తీ చేయలేదని లేఖలో పేర్కొన్నారు.
పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో పన్నెండు మంది సభ్యులు ఉండగా... ఏడు ఖాళీలు ఉండటం పట్ల పయ్యావుల కేశవ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. శాసనసభ నుంచి ఐదు, మండలి నుంచి రెండు ఖాళీలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. పీఏసీలో ఉన్న కోలగట్ల వీరభద్ర స్వామి, మేరుగ నాగార్జున, కరణం ధర్మ శ్రీ, జోగి రమేష్, కేవి ఉషశ్రీ చరణ్‌లకు మంత్రి పదవులు రావడంతో పీఏసీలో ఖాళీలు ఏర్పడ్డాయి. వెంటనే వాటిని భర్తీ చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఏడు ఖాళీలు ఉండటంతో పీఏసీ తన విధులను నిర్వహించలేకపోతోందని పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.
Updated Date - 2023-03-21T16:14:32+05:30 IST