ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Potina Venkata Mahesh: వైసీపీ నేతల అరాచకాలకు పేదల కన్నీళ్లే నిదర్శనం...

ABN, First Publish Date - 2023-04-09T12:09:44+05:30

విజయవాడ: ఇంటింటికీ రాబోయే మన జనసేన ప్రభుత్వం నూతన కార్యక్రమంలో భాగంగా జనసేన పశ్చిమ నియోజకవర్గం ఇన్చార్జ్ పోతిన వెంకట మహేష్ నాలుగో రోజు ఆదివారం 42వ డివిజన్‌లో పర్యటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

విజయవాడ: ఇంటింటికీ రాబోయే మన జనసేన ప్రభుత్వం నూతన కార్యక్రమంలో భాగంగా జనసేన పశ్చిమ నియోజకవర్గం ఇన్చార్జ్ పోతిన వెంకట మహేష్ నాలుగో రోజు ఆదివారం 42వ డివిజన్‌లో పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎక్కడకి వెళ్లినా ప్రజలు సమస్యలను చెబుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. ఇంటింటికీ రాబోయే మన జనసేన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. వైసీపీ నేతలు చేసే అరాచకాలకు పేదల కన్నీళ్లే నిదర్శనమన్నారు.

ఇళ్లకు డబ్బులు కట్టినా వారికి ఇవ్వకుండా తిప్పించుకుంటున్నారని, ఎన్నికల సమయంలో వరాలు కురిపించిన వైసీపీ నాయకులు ఇవాళ కనిపించకుండా పోయారని పోతిన వెంకట మహేష్ దుయ్యబట్టారు. ఓట్లు వేయించుకుని ఫొటోలు దిగిన వారు.. ఇప్పుడు సమస్యలపై స్పందించరా? అని ప్రశ్నించారు. చిన్నారిపై లైంగిక దాడి జరిగితే.. కనీసం వైసీపీ నాయకులు స్పందించకపోవడం దారుణమన్నారు. విపక్షాలపై బూతులు తిట్టే వారికి... కనీసం మానవత్వం లేదా? అని నిలదీశారు. ఫొటోలకు ఫోజులిచ్చి ప్రచారం చేస్తూ కొంతమంది పకోడీగాళ్లు ఏదో మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ప్రతి ఇంటికీ వెళ్లి పైకి కిందకి దిగి ప్రజలను కలుస్తున్నామన్నారు.

ఇంటింటికీ అంటే.. రోడ్డు మీద ఉండి అందరినీ కిందకు దింపడం కాదని, మెడలో బ్యాగు వేసుకుని, స్టిక్కలు అంటించుకుని వెళ్లడం కాదని పోతిన వెంకట మహేష్ ఎద్దేవా చేశారు. ప్రజల బాధలను వినేందుకు సమయం కేటాయించాలన్నారు. అవినీతిపరులు కూడా నీతులు చెప్పడం ఏపీలోనే చూస్తున్నామన్నారు. జనసేన పార్టీ ఎప్పటికీ జనసేనతోనూ.. జనంతోనే ఉంటుందని, వైసీపీ అవినీతి బాగోతం చిట్టా మొత్తం తీస్తున్నామని... త్వరలోనే బయట పెడతామని పోతిన వెంకట మహేష్ స్పష్టం చేశారు.

Updated Date - 2023-04-09T12:09:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising