Sajjala: మూడు రాజధానులపై సజ్జల కీలక వ్యాఖ్యలు...
ABN, First Publish Date - 2023-02-15T14:33:20+05:30
అమరావతి: ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) మూడు రాజధానులపై (Three Capitals) కీలక వ్యాఖ్యలు (Key Comments) చేశారు.
అమరావతి: ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) మూడు రాజధానులపై (Three Capitals) కీలక వ్యాఖ్యలు (Key Comments) చేశారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ అన్ని ప్రాంతాల ప్రజల ఆకాంక్షలతో వికేంద్రీకరణ అవసరాన్ని గుర్తించి గతంలో మూడు రాజధానుల బిల్లు పెట్టామని, రాజధానుల వ్యవహారం ప్రస్తుతం న్యాయస్థానం
లో నడుస్తోందన్నారు. తమ వాదన వినిపిస్తున్నామని, ప్రభుత్వం కోర్టులో వినిపిస్తున్న విషయాన్నే మంత్రి బుగ్గన (Minister Buggana) చెప్పారన్నారు. మూడు రాజధానులకే ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
ప్రభుత్వ వైఖరిలో ఎలాంటి తేడా లేదని, మూడు రాజధానుల ఏర్పాటుపై ఎవరికీ ఎలాంటి అనుమానం అక్కర లేదని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అసెంబ్లీ అమరావతి (Assembly Amaravathi)లో ఉంటుందని.. హైకోర్టు కర్నూలు (High Court Kurnool)లో వస్తుందని.. విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధాని (Visakha Executive Capital)గా ఉంటుందని సజ్జల పేర్కొన్నారు. వీటిని మేము మూడు కేపిటల్స్ అనే పిలుస్తామని అన్నారు. పరిపాలనను వికేంద్రీకరించాలనదే తమ ఉద్దేశమన్నారు. మంత్రి బుగ్గన కూడా ఇదే విషయం చెప్పారన్నారు. ప్రభుత్వం అసెంబ్లీలో, సుప్రీంకోర్టులో చెప్పే వాదనే ప్రధానమైందని అన్నారు. కొందరు కావాలనే రాజధానిపై గందరగోళం సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖకు సీఎం క్యాంపు కార్యాలయమా?.. పూర్తిగా వెళ్లడమా?.. అనేది సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పును బట్టే ఉంటుందని సజ్జల స్పష్టం చేశారు. రాజధానిపై నిర్ణయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానిదేనని, హైకోర్టులో కేంద్రం అఫిడవిట్ ద్వారా తెలిపిందని, సుప్రీంకోర్టులోనూ కేంద్రం అదే విధాన్నాన్ని అవలంభిస్తుందని ఆశిస్తున్నామని సజ్జల పేర్కొన్నారు.
మంత్రి బుగ్గన వ్యాఖ్యలపై అనవసర రాద్దాంతం చేస్తున్నారని, రాజధానులపై మీడియా కన్ఫ్యూజ్ చేస్తోందని సజ్జల పేర్కొన్నారు. వికేంద్రీకరణపైనే వచ్చే ఎన్నికలకు వెళతామన్నారు. అసెంబ్లీ సమావేశాలన్నీ అమరావతిలోనే జరుగుతాయని, కేవలం ఒకసారి సమావేశాలు మాత్రమే గుంటూరులో జరుగుతాయని బుగ్గన ...ఏ సందర్భంలో ఎలా అన్నారో తెలియదని అన్నారు. ఏదో జరిగి పోతుందని అనుమానం కలిగేలా కొందరు చేస్తున్నారని విమర్శించారు. విశాఖకు పరిశ్రమలు వస్తే టీడీపీకి ఎందుకు కడుపు మంట అని సజ్జల ప్రశ్నించారు.
Updated Date - 2023-02-15T14:33:23+05:30 IST