Vijayawada: చిన్నారిపై వీధి కుక్కల దాడి..
ABN, First Publish Date - 2023-06-06T15:24:37+05:30
విజయవాడ: బెజవాడలో వీధి కుక్కలు రెచ్చిపోయాయి. వన్ టౌన్ వాగు సెంటర్ ప్రాంతం, 48వ డివిజన్‌లో చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో ఐదేళ్ల బాలిక మేఘన తీవ్రంగా గాయపడింది.
విజయవాడ: బెజవాడలో వీధి కుక్కలు (Street Dogs) రెచ్చిపోయాయి. వన్ టౌన్ వాగు సెంటర్ ప్రాంతం, 48వ డివిజన్‌లో చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో ఐదేళ్ల బాలిక మేఘన తీవ్రంగా గాయపడింది. బాలిక అరుపులతో స్థానికులు కుక్కలను తరిమికొట్టారు. చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. కగా రెండు నెలల క్రితం ఒకే ప్రాంతంలో ఒకే రోజు నలుగురు చిన్నారులను వీధి కుక్కలు తీవ్రంగా గాయపరిచాయి. ఆ ఘటన మరిచిపోక ముందే మంగళవారం వాగు సెంటర్ 48వ డివిజన్‌లో షాపు నుంచి ఇంటికి నడిచి వెళుతున్న చిన్నారిపై మూడు వీధి కుక్కలు దాడి చేశాయి. తీవ్రంగా గాయపడిన బాలికను హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందించగా ప్రాణాపాయం తప్పింది. కుక్కల బెడదపై స్థానికులు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా మొక్కుబడిగా చర్యలు తీసుకున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - 2023-06-06T15:24:37+05:30 IST