ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tarakaratna: అత్యంత విషమంగా తారకరత్న ఆరోగ్యం

ABN, First Publish Date - 2023-02-18T15:06:39+05:30

సినీ నటుడు, నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: సినీ నటుడు, నందమూరి తారకరత్న (Nandamuri Tarakaratna) ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బెంగళూరులోని నారాయణ హృదయాలయ (Narayana Hrudalayala Hospital) ఆస్పత్రి వైద్యులు మరోసారి ఆయనకు బ్రెయిన్‌ స్కాన్‌ (Brain Scan) చేశారు. విదేశీ వైద్యుల బృందం ఆధ్వర్యంలో తారకరత్నకు ప్రత్యేక చికిత్స కొనసాగుతోంది. గత 22 రోజులుగా నారాయణ హృదయాలయలో తారకరత్న చికిత్స పొందుతున్నారు. తారకరత్న(Actor)ను కోమా నుంచి బయటకు తీసుకువచ్చేందుకు వైద్యులు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తారకరత్న పరిస్థితి తెలిసిన వెంటనే నందమూరి కుటుంబసభ్యుల (Nandamuri Family)తో పాటు బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఆస్పత్రికి చేరుకున్నారు. ఈరోజు సాయంత్రం ఏ సమయంలోనైనా తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు హెల్త్‌ బులిటెన్‌ (Health Bulletin)ను విడుదల చేసే అవకాశం ఉంది.

జనవరి 26న టీడీపీ యువనేత నారా లోకేష్ ‘‘యువగళం’’ పాదయాత్ర (TDP Leader Lokesh YuvaGalam Padayatra)లో తారకరత్న పాల్గొన్నారు. ఈ క్రమంలో లోకేష్‌ (Naralokesh)తో పాదయాత్ర చేస్తూ తారకరత్న ఒక్కసారిగా గుండెపోటుకు గురై కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను హుటాహుటిన కుప్పంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. ఆపై మెరుగైన వైద్యం కోసం బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి తారకరత్న కోలుకునేందుకు వైద్యులు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. విదేశీ వైద్యులను పిలిపించి మరీ తారకరత్నకు వైద్యం అందిస్తున్నారు. మరోవైపు తారకరత్న త్వరగా కోలుకోవాలని నందమూరి అభిమానులు, ప్రజలు కోరుకుంటున్నారు.

Updated Date - 2023-02-18T17:02:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising