Jawahar: వివేకా హత్యలో ధోషులెవరో తేలిపోయింది..
ABN, First Publish Date - 2023-04-17T11:36:19+05:30
అమరావతి: వైఎస్ వివేకా హత్య (YS Viveka Murder Case)లో దోషులెవరో తేలిపోయిందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జవహర్ (Jawahar) పేర్కొన్నారు.
అమరావతి: వైఎస్ వివేకా హత్య (YS Viveka Murder Case)లో దోషులెవరో తేలిపోయిందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జవహర్ (Jawahar) పేర్కొన్నారు. ఈ సందర్బంగా సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఇంకా వేరే ఆరోపణలెందుకో వైకాపా నాయకులు (YCP Leaders) చెప్పాలన్నారు. కీలక అంశాలేంటో నేరస్తుల నుంచి నేర్చుకోవలసిన అవసరం సీబీఐ (CBI)కు లేదన్నారు. నేరస్తుడు ఎప్పుడు బుకాయింపుపైనే ఆధారపడటం సాధారణమన్నారు. వివేకాను చంపి.. పగ చల్లారక వ్యక్తిత్వ హననం చేస్తున్నారని అన్నారు.
వైఎస్ వివేకా కుమార్తె సునీతా (Sunitha) పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని జవహర్ అన్నారు. వివేకా హత్య తీరు మిష్టరీ సినిమాను తలపిస్తోందన్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి (MP Avinash Reddy) బుకాయింపు మానుకోవాలని సూచించారు. గొడ్డలి కొన్న దగ్గర నుంచి హత్య వరకు అన్నీ తేలి పోయాయన్నారు. గూగుల్ టేక్ అవుట్ మార్ఫింగా? అని ప్రశ్నించారు. సాక్ష్యాలను తారుమారు చేసి ఎలా తప్పించుకుంటారని జవహర్ నిలదీశారు.
Updated Date - 2023-04-17T11:36:19+05:30 IST