Devineni Uma: గుంటూరు తొక్కిసలాట ఘటనపై దేవినేని ఉమ ఏమన్నారంటే..
ABN, First Publish Date - 2023-01-02T16:36:03+05:30
అమరావతి: గుంటూరులో ఆదివారం ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన చంద్రన్న సంక్రాంతి కానుక పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట ఘటనపై స్పందించిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని మాట్లాడుతూ..
అమరావతి: గుంటూరులో ఆదివారం ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన చంద్రన్న సంక్రాంతి కానుక (Chandranna Sankranthi Kanuka) పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట ఘటనపై స్పందించిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని (Devineni Uma) మాట్లాడుతూ.. ఎన్ఆర్ఐ శ్రీనివాసరావు (NRI Srinivasarao) ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారని, నిన్న గుంటూరులో పోలీసులు అనుమతితోనే ఈ కార్యక్రమం చేపట్టారన్నారు. జరిగిన దుర్ఘటనలో ముగ్గురు చనిపోవడం బాధాకరమన్నారు. ముందుగానే రాసుకున్న స్క్రిప్ట్ ప్రకారం వైసీపీ నేతలు (YCP Leaders) క్యూలు కట్టి నోళ్లు పారేసుకున్నారని మండిపడ్డారు. జగనన్న సైన్యం, అసలు రాజకీయం జనవరి నుంచి చూస్తారని నవంబర్ 20న ప్రచారం చేశారన్నారు. ‘గజగజ వణకాల్సిందే ఒక్కొక్కడు ... స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి’ అని పోస్టు పెట్టారన్నారు. నిన్న జరిగిన ఘటనకు.. ఈ పోస్టుకు సంబంధం ఉందన్నారు.
జగనన్న సైన్యం, జగన్‌పై కూడా కేసు నమోదు చేయాలని దేవినేని ఉమ డిమాండ్ చేశారు. శ్రీనివాసరావుపై 304 సెక్షన్ కింద కేసు పెడతారా? జీవిత ఖైదు, జరిమానా శిక్ష పడే సెక్షన్ పెట్టారంటే సీఎం జగన్ (CM Jagan) ఆలోచన అర్ధం అవుతుందన్నారు. ఎన్ఆర్ఐ పేదలకు సాయం చేసేందుకు ముందుకు వస్తే ఇలా చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్, మంత్రులు, ఎమ్మెల్యేలు దురుద్దేశ పూర్వకంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. కోడి కత్తితో పొడిపించుకున్న వ్యక్తి సిఎం అయ్యారని, అవినాష్ రెడ్డిని కాపాడటానికి ప్రధానిని కలిశారని ఆరోపించారు. తన స్వార్ధ రాజకీయాల కోసం బాబాయి హత్యను కూడా అడ్డుగా పెట్టి వాడుకున్నారని విమర్శించారు. ఇప్పుడు అన్ని వాస్తవాలు, సీఎం జగన్ మోసాలు ప్రజలకు అర్ధం అయ్యాయన్నారు. గుంటూరులో జరిగిన ఘటన వెనుక వైసీపీ హస్తం ఉందన్నారు. ఉద్దేశపూర్వకంగా ఈ సంఘటనల ద్వారా పోలీసులను నిర్వీర్యం చేశారన్నారు. ఈ తప్పిదాలకు వైసీపీ ప్రభుత్వానిదే బాధ్యతని దేవినేని ఉమ అన్నారు.
Updated Date - 2023-01-02T16:36:06+05:30 IST